Radhe Shyam Second Song : రాధేశ్యామ్ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్, ప్రభాస్‌ పూజాల కెమిస్ట్రీ అదిరిపోయింది

Prabhas Radhe Shyam Movie Second Song Released: ఇటీవ‌ల రాధేశ్యామ్ నుంచి ఆషికీ ఆషికీ ఆ గయి అంటూ సాగే హిందీ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్ర‌భాస్‌, పూజా హెగ్డేల మ‌ధ్య రొమాంటిక్‌గా లవ్ సాంగ్ ఇది. ఆషికీ ఆ గయి ఫుల్ సాంగ్‌ను మూవీ యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ పాట కూడా అదిరిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2021, 02:12 PM IST
  • రాధేశ్యామ్ మూవీ నుంచి మరో సాంగ్
  • జ‌న‌వ‌రి 14న రాధేశ్యామ్ మూవీ రిలీజ్
  • జోరుగా ప్ర‌మోష‌న్స్
  • ఆషికీ ఆ గయి ఫుల్ సాంగ్‌ రిలీజ్
Radhe Shyam Second Song : రాధేశ్యామ్ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్, ప్రభాస్‌ పూజాల కెమిస్ట్రీ అదిరిపోయింది

Prabhas Pooja Hegde's Radhe Shyam Movie Second Song Love Anthem Aashiqui Aa Gayi Released : ప్ర‌భాస్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న రాధేశ్యామ్ మూవీ నుంచి మరో సాంగ్ వచ్చేసింది. జ‌న‌వ‌రి 14న రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం జోరుగా ప్ర‌మోష‌న్స్ కొనసాగుతున్నాయి. ఇటీవ‌ల రాధేశ్యామ్ (Radhe Shyam) నుంచి ఆషికీ ఆ గయి ( Aashiqui Aa Gayi) అంటూ సాగే హిందీ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్ర‌భాస్‌, పూజా హెగ్డేల మ‌ధ్య రొమాంటిక్‌గా లవ్ సాంగ్ ఇది. 

ఇక ఆషికీ ఆ గయి ఫుల్ సాంగ్‌ను మూవీ యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ పాట కూడా అదిరిపోయింది. విజువ‌ల్స్ సూపర్ ఉన్నాయి. ప్ర‌భాస్‌, పూజా హెగ్డేల మ‌ధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంది. ఈ లవ్‌ సాంగ్‌ను అర్జీత్‌ సింగ్‌ పాడారు. ఇక రాధేశ్యామ్‌ మూవీ హిందీ వెర్షన్‌కు మిథున్‌ సంగీతం అందిస్తున్నారు. 

Also Read : Petrol Price In Delhi: ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం.. పెట్రోల్ పై రూ.8 తగ్గింపు!

ఆషికీ ఆ గయి సాంగ్‌ ( Aashiqui Aa Gayi ) తెలుగు వెర్షన్‌ (Telugu version‌) నగుమోము తారలేగా ఇవాళ సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానుంది. ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ పాడారు. ఇక ఇటీవల విడుదలైన రాధేశ్యామ్‌ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో ప్రభాస్ పల్మానాలజిస్ట్‌గా ఆకట్టుకోబోతున్నాడు. ఎదుటివారి చేతి రేఖ‌ల‌ను చూసి వారి భ‌విష్య‌త్తును చెప్పే పాత్రలలో ప్రభాస్ కనిపించనున్నారు. పూజాహెగ్డే (Pooja Hegde) ప్రేరణ పాత్రలో సందడి చేయనుంది. అయితే త‌న ప్రేయ‌సి చేతి రేఖ‌ల‌ను చూసి ఆమెకు ముంచుకొచ్చు ప్ర‌మాదాల‌ను ప‌సిగ‌డ‌తాడు ప్రభాస్. హీరోయిన్‌ను ఆ ప్ర‌మాదాల నుంచి ఎలా ర‌క్షించుకుంటాడు అనేది సినిమా నేపథ్యంగా ఉండనుంది. యూవీ క్రియేష‌న్స్‌ (uv creations).. టి సిరీస్ (T-Series) సంస్థ‌ల‌పై భారీ బడ్జెట్‌తో భూష‌ణ్ కుమార్‌, వంశీ, ప్ర‌మోద‌, ప్ర‌శీద ఈ మూవీని రూపొందించారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్టర్. ఈ మూవీలో భాగ్యశ్రీ, ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read : టాలీవుడ్‌లో వరుస మరణాలు.. మొన్న మాస్టర్‌,నిన్న సిరివెన్నెల,ఈ రోజు యంగ్ హీరో సోదరుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News