Ram Siya Ram Song : ఆదిపురుష్‌ అప్డేట్.. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా

Ram Siya Ram Song ఆదిపురుష్‌ నుంచి జై శ్రీరామ్ అనే పాట రావడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. జై శ్రీరామ్ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు దేశాన్ని భక్తిభావంలో ముంచెత్తుతోంది. ఇప్పుడు ఇదే ఊపులో రామ్ సీతా రామ్ సాంగ్ అప్డేట్ వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2023, 11:45 AM IST
  • నెట్టింట్లో ఆదిపురుష్‌ ట్రెండ్
  • రామ్ సీతా రామ్ సాంగ్
  • నెవ్వర్ బిఫోర్ అనేలా ఈవెంట్
Ram Siya Ram Song : ఆదిపురుష్‌ అప్డేట్.. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా

Ram Siya Ram Song ఆదిపురుష్‌ మీద ఇప్పుడు ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. టీజర్‌తో వచ్చిన ట్రోలింగ్.. సాంగ్‌తో అంచనాలు పెంచేసింది. ఇక ఆదిపురుష్ ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంది. టీజర్‌తో ఏర్పడిన నెగెటివిటీ అంతా కూడా ట్రైలర్, జై శ్రీరామ్ పాటతో పోయింది. జై శ్రీరామ్ పాటను ముంబైలో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్స్‌ ఈ పాటను లైవ్ పర్ఫామెన్స్‌ ఇచ్చారు. ఇప్పుడు రెండో పాటను గ్రాండ్‌గా విడుదల చేయబోతోన్నారట.

టీజర్‌ను ఆల్రెడీ వంద మిలియన్ల మంది  చూశారు.. ఇప్పుడు జై శ్రీరామ్ పాట కూడా వంద మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇలా ఆదిపురుష్‌ నుంచి ఏ అప్డేట్ వదిలినా కూడా వైరల్ అవుతోంది. అయితే ఈ రెండో పాటను ఇప్పుడు భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మే 29న మిట్ట మధ్యాహ్నం ఈ రెండో పాటను రిలీజ్ చేయాలని ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.

మూవీ చానెల్స్, జీఈసీ, దాదాపు డెబ్బైకి పైగా రేడియో స్టేషన్లలో, న్యూ చానెల్స్, ఆన్ లైన్, టికెట్ బుకింగ్ ఫ్లాట్ ఫామ్స్, మూవీ థియేటర్లలో ఒకే సారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో దేశం మొత్తం ఆదిపురుష్ రెండో పాట హాట్ టాపిక్ కానుంది. ఇక ఆదిపురుష్ సినిమా విడుదల కోసం ప్రభాస్ అభిమానులే కాకుండా దేశం అంతా కూడా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:  Ram Charan Speech : నందమూరి అభిమానుల మనసు గెలిచిన రామ్ చరణ్.. ఎన్టీఆర్‌పై స్పీచ్ అదుర్స్

జూన్ 16న ఆదిపురుష్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం విదితమే. ఆదిపురుష్‌ సినిమా పాటలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతోంది. టీజర్ ఓ మోస్తరుగా మెప్పించినా.. ట్రైలర్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. త్రీడీలో ఆదిపురుష్ మరింత ఎఫెక్టివ్‌గా అనిపిస్తోంది. దీంతో త్రీడీ స్క్రీన్లలోనే ఆదిపురుష్‌ను ఎక్కువగా వీక్షించేట్టు కనిపిస్తోంది.

Also Read:  Anasuya Bikini Pics : మొదటి సారిగా బికినీలో అనసూయ.. ఫ్యామిలీ ఫ్యామిలీ మునిగిందిగా?.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News