Prabhas: షారుఖ్ పఠాన్ రికార్డును బ్రేక్ వేసిన ప్రభాస్ ‘కల్కి’.. రెబల్ స్టారా.. మజాకా..!

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ మూవీ బాక్సాఫీస్ దగ్గర పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ లో షారుఖ్ నటించిన ‘పఠాన్’ మూవీ రికార్డులను బ్రేక్ చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 22, 2024, 10:18 AM IST
Prabhas: షారుఖ్ పఠాన్  రికార్డును బ్రేక్ వేసిన ప్రభాస్ ‘కల్కి’.. రెబల్ స్టారా.. మజాకా..!

Prabhas:  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో  అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. దీపికా, దిశా పటానీ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్ల గ్రాస్ మార్క్ అందుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదు బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన కల్కి మూవీ రూ. 1000 కోట్ల క్లబ్బులో చేరడంతో రెబల్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తొలి రోజు కలిపి $7 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.

తాజాగా ఈ సినిమా నార్త్ అమెరికాలో $ 18.5 మిలియన్ డాలర్స్ కలక్ట్ చేసి పఠాన్ రికార్డును బ్రేక్ చేసింది. నార్త్ అమెరికాలో షారుఖ్ నటించిన ‘పఠాన్’ మూవీ $18 మిలియన్ డాలర్స్ తో బాహుబలి తర్వాత రెండో ప్లేస్ లో ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘బాహుబలి 2’ సినిమా $ 21 మిలియన్ డాలర్స్ తో ఇప్పటికీ టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఈ రికార్డును బ్రేక్ చేయడం అంత ఈజీ కాదనే చెప్పాలి.

మొత్తం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లను సాధించిన మొదటి, రెండు చిత్రాలు ప్రభాస్ నటించినవే కావడం గమనార్హం. ఏది ఏమైనా ప్రభాస్ దూకుడు చూస్తుంటే కల్కి మూవీ అక్కడ $20 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 3 వారాలు పూర్తి చేసుకొని నాల్కో వారం రన్ అవుతుంది. నిన్న ఆదివారంతో ఈ సినిమా రన్ దాదాపు ముగిసిందనే చెప్పాలి.

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News