Kalki2898AD Pre Release Event: ప్రభాస్ లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా.. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా!

Prabhas Kalki Review : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్.. తన లుక్స్ మీద.. ఫోకస్ చేయడం లేదు అని.. తన మొహం మొత్తం చాలా పాడైపోయింది అని.. వయసు మొత్తం మొహం లోనే కనిపిస్తుంది అని.. చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేశారు. కానీ ఆ కామెంట్లు అన్నిటికీ.. తన ప్రజెంట్ లుక్ తో.. ఫుల్ స్టాప్ పెట్టేసాడు ప్రభాస్. కల్కి సినిమా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. ప్రభాస్ లుక్స్ అభిమానులకి సైతం షాక్ ఇచ్చాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 20, 2024, 08:25 AM IST
Kalki2898AD Pre Release Event: ప్రభాస్ లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా.. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా!

Prabhas in Kalki Pre-release Event: గత కొంతకాలంగా.. ప్రభాస్ లుక్స్ మీద ఎన్నో ట్రోల్స్ వినిపిస్తున్న.. సంగతి తెలిసిందే. మిర్చి, డార్లింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన సమయంలో ఉన్న ప్రభాస్ కి.. ఇప్పటికీ.. అసలు సంబంధమే లేదని.. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చాలా పాడైపోయాడు అని.. ఎన్నో రకాల కామెంట్లు వింటూనే ఉన్నాం. 

రాధే శ్యామ్.. సినిమాలో కూడా ఎంత స్టైలిష్ గా చూపించాలని ప్రయత్నించినా.. ప్రభాస్ అసలు బాగోలేదని.. చాలామంది కామెంట్స్ చేశారు. ఇక సలార్ మొత్తం.. యాక్షన్ సినిమా కాబట్టి మంచి బాడీ అయితే బిల్డ్ చేశారు కానీ.. మొహం లో కళ మాత్రం లేదని.. చాలామంది అన్నారు.

కానీ ఇప్పుడు ఆ పుకార్లన్నిటికీ చెక్ పెడుతూ.. ప్రభాస్ కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన అదిరిపోయే లుక్కుతో.. అందరికీ షాక్ ఇచ్చారు. ఇంతకుముందు లాగానే ప్రభాస్ చాలా స్టైలిష్ గా.. కనిపించి.. అందరి దృష్టిని ఆకర్షించారు. చిన్నప్పటి నుంచి మొహమాటపరుడైన.. ప్రభాస్ పెద్దగా స్పీచ్ ఇచ్చింది లేదు.. కానీ ప్రభాస్ లుక్స్ మాత్రం సోషల్ మీడియా లో రచ్చ లేపుపోతున్నాయి. 

 

ప్రభాస్ అభిమానులు కాని వాళ్ళు.. కూడా ప్రభాస్ లుక్స్ కి ఫిదా అయిపోతున్నారు. మళ్లీ ఇన్నాళ్ళకి ప్రభాస్ చాలా అందంగా కనిపించారని.. అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ప్రభాస్ లుక్స్ ని ట్రోల్ చేసిన వాళ్ళు.. ఎక్కడున్నా ఇప్పుడు ప్రభాస్ ని చూడాలని.. సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక భారీ అంచనాల మధ్య.. విడుదలవుతున్న కల్కి సినిమా కూడా.. అన్ని రికార్డులను బ్రేక్ చేయడానికి రెడీ అవుతోంది. భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ కలెక్షన్లు నమోదు చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రభాస్ లుక్స్ చూసిన చాలా మంది అభిమానులు.. ఈ క్రమంలో కల్కి సినిమా సగం హిట్ అయిపోయినట్లే.. అని కూడా కామెంట్లు పెడుతున్నారు.

Also Read: O Manchi Ghost: థియేటర్లకు రండి.. హాయిగా నవ్వుకుని వెళ్లండి: OMG మూవీ టీమ్

Also Read: Bharatheeyudu 2: కమలహాసన్ పరిస్థితి ఇలా అయింది ఏమిటి..? భారతీయుడు 2 థియేట్రికల్ బిజినెస్ పై నీలి నీడలు.. ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News