Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..

Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమా బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..  

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 20, 2024, 02:26 PM IST
Kalki 2898 AD: ప్రభాస్  ‘కల్కి’  మూవీ బ్రేక్ చేయాల్సిన  రికార్డులు ఇవే..

Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా నిన్న సాయంత్రం ముంబైలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సినిమా స్టోరీ మొత్తం చెప్పేసారు నాగ్ అశ్విన్. మొత్తంగా మహా భారత కాలం నుంచి 2898 వరకు మొత్తంగా 6 వేల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు చెప్పారు. అంతేకాదు ఈ సినిమా మూడు వింత ప్రపంచాల మధ్య జరుగుతుందని వివరించారు. పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న కాశీ పుణ్యక్షేత్రం ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరంగా మన వేదాలు, పురాణాలతో పాటు విదేశీయులు కూడా చెబుతున్నారు. ఈ ప్రపంచంలోనే వారణాసి మొదటి నగరమని ఎన్నో శాసనాల్లో ఉంది. ప్రపంచ నాగరిత పుట్టిందే ఇక్కడ నుంచి అని అందరు చెబుతుంటారు.

అలాంటి కాశీ ప్రపంచంలో చివరి నగరమైతే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను స్టోరీని రెడీ చేసుకున్నట్టు దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు. జీవ నది అయిన గంగా నది ఎండి పోవడం వల్ల ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. మరోవైపు తిరగేసిన పిరమిడ్ ఆకారంలో ఉండే ప్రదేశానికి కాంప్లెక్స్. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇంకోటి శంబల. విష్ణు మూర్తి చివరి అవతారం ఇక్కడే దాల్చడాని మన పురాణాలు చెబుతుంటాయి. ఈ మూడు ప్రపంచాలను ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయనే కాన్సెప్ట్ తో ‘కల్కి 2898 AD’ మూవీని నిర్మించినట్టు చెప్పుకొచ్చారు.

ఇప్పటికే కల్కి మూవీ యూఎస్ బాక్సాఫీస్ దగ్గర దూకుడు మీదుంది. విడుదలకు మూడు వారాల ముందే బుకింగ్స్ ఓపెన్ చేస్తే టిక్కెట్స్ క్షణాల్లో అమ్ముడు పోవడం విశేషం.  ఇప్పటికే 2.5 మిలియన్ టిక్కెట్స్ సేల్స్ అయిపోయాయి. దీంతో ఈ సినిమా కోసం అక్కడ ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారనే విషయం స్పష్టమైంది. అమెరికాలో ప్రీమియర్స్ తో అత్యధిక వసూళ్లను సాధించే చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే రాజమౌళి ‘RRR’ మూవీ 3.46 మిలియన్ యూఎస్ డాలర్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది. కల్కి మూవీ ఈ టార్గెట్ ను రీచ్ అవుతుందా అనేది చూడాలి.  ఇక యూఎస్ బాక్సాఫీస్ దగ్గర టాప్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల విషయానికొస్తే..

ఆర్ఆర్ఆర్ మూవీ $3.46 M ($ 28 M)
సలార్ మూవీ $ 2.60 మిలియన్ డాలర్స్  ప్రీమియర్స్ ద్వారా కలెక్ట్ చేసింది. మొత్తంగా $ 25 మిలియన్ డాలర్స్ రాబట్టింది.
బాహుబలి 2 - $ 2.45 M ప్రీమియర్స్ ($ 28 M)
అజ్ఞాతవాసి - $ 1.5 M ($ 25)
గుంటూరు కారం -$ 1.4 M ($20) రాబట్టాయి. మొత్తంగా కల్కి టికెట్ అక్కడ 34 యూఎస్ డాలర్స్ గా ఉంది. మొత్తంగా చూసుకుంటే .. రిలీజ్ వరకు టాప్ 3లో ఒకటిగా నిలిచే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ నెంబర్ వన్ ప్లేస్ వచ్చినా.. ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మొత్తంగా ‘కల్కి2898 AD’ మూవీ యూఎస్ బాక్సాఫీస్ సహా తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.  

Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News