Salaar Movie Teaser: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. సలార్ టీజర్ డేట్ ఇదే..!

Salaar Teaser Release Date And Time: ప్రభాస్‌ అభిమానులకు సలార్ మూవీ మేకర్స్ గుడ్‌న్యూస్ చెప్పారు. జూలై 6న టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. నెట్టింట వైరల్ చేస్తున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jul 3, 2023, 03:23 PM IST
Salaar Movie Teaser: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. సలార్ టీజర్ డేట్ ఇదే..!

Salaar Teaser Release Date And Time: ఆదిపురుష్ నిరాశ పర్చడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు సలార్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్‌ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. బాహుబలి సిరీస్‌ తరువాత ప్రభాస్‌కు పాన్‌ ఇండియా లెవల్లో సలార్ బ్లాక్‌బస్టర్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తుండగా.. శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా నటిస్తోంది. జ‌గ‌ప‌తి బాబు కీరోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విల‌న్‌గా యాక్ట్ చేస్తుండడంతో అంచనాలను రెట్టింపు చేసింది. 

తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు మేకర్స్ గుడ్‌న్యూస్ చెప్పారు. టీజర్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ నెల 6న ఉదయం 5.12 గంటలకు సలార్ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో అభిమానులు నెట్టింట సందడి షూరు చేశారు. #SalaarTeaser హ్యాష్‌ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పోస్టర్‌తో ఫ్యాన్స్ ఎక్స్‌పెటేషన్స్ నెక్ట్స్‌ లెవెల్‌కు రీచ్ అయ్యాయి. పోస్టర్‌లో ప్ర‌భాస్ లుక్ వెనుక నుంచి చూపించారు. విల‌న్ గుండెల్లో హీరో గొడ్డ‌లిని దించి పవర్‌ ఫుల్‌గా కనిపిస్తున్నాడు. పోస్టర్ హైరేంజ్‌లో ఉందని.. సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

 

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు. ప్రశాంత్ నీల్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ గట్టినమ్మకమే పెట్టుకున్నారు. ఆదిపురుష్‌పై భారీ అంచనాలు పెట్టుకోగా.. దారుణంగా నిరాశపర్చింది. సలార్ తరువాత ప్రాజెక్ట్ కె సినిమా రానుంది. అదేవిధంగా మారుతి డైరెక్షన్‌లో మరో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్‌గా సాగుతోంది. ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలతో ప్రభాస్ ఆడియన్స్‌ను అలరించనున్నాడు. 

Also Read: Jonny Bairstow Controversial Run Out: ఊహించని రీతిలో బెయిర్‌ స్టో రనౌట్.. ఫస్ట్ టైమ్ ఇలా..  

Also Read: Telangana Politics: అవినీతికి కాంగ్రెస్ రారాజు.. అందుకే రాహుల్ గాంధీ ఓడిపోయారు: మంత్రులు ఫైర్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News