Adipurush Teaser : నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్.. సరయు నదిలోంచి ఆదిపురుష్ పోస్టర్?

Prabhas Adipurush Teaser Launch Event Special ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ టీజర్‌ను ఆదివారం సాయంత్రం అయోధ్యలో సరయు నది ఒడ్డున గ్రాండ్‌గా లాంచ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ సంగతులు వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2022, 03:43 PM IST
  • అయోధ్యలో సరయు నది ఒడ్డున సందడి
  • ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ ప్రత్యేకతలివే
  • యాభై అడుగుల ఎత్తు ఉండే ఆదిపురుష్ పోస్టర్
Adipurush Teaser : నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్.. సరయు నదిలోంచి ఆదిపురుష్ పోస్టర్?

Adipurush Teaser Launch Event : ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ నేడు (అక్టోబర్ 2) రిలీజ్ కాబోతోంది. అయోధ్య నగరంలో సరయు నది ఒడ్డున ఆదిపురుష్ టీజర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మేరకు టీజర్ లాంచ్ ఈవెంట్ ప్రత్యేకతలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఆదిపురుష్ మీద ఉన్న అంచనాలన్నీ రెట్టింపయ్యే రోజు ఇదే కావడంతో అన్ని ఇండస్ట్రీల జనాలు అయోధ్య వైపు చూస్తున్నాయి. సరయు నదికి రామాయణంలో ఉన్న విశిష్టత గురించి తెలిసిందే.

రాముడు చివరి దశలో ఈ సరయు నదిలోకి వెళ్లిపోయాడని తెలిసిందే. అలా ఇప్పుడు రాముడు తిరిగిన నేలపైనే ఆదిపురుష్ టీజర్‌ను లాంచ్ చేయబోతోన్నారు. అయితే ఈ ఈవెంట్లో ఎన్నెన్నో విశిష్టతలున్నాయని తెలుస్తోంది. ఈ ఈవెంట్‌ను కవర్ చేసేందుకు దేశవ్యాప్తంగా మీడియాను అక్కడికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ముంబై, హైద్రాబాద్, చెన్నై, ఢిల్లీ ఇలా అన్ని చోట్ల నుంచి మీడియాను తీసుకెళ్లిందట చిత్రయూనిట్.

 

అయితే సరయు నది ఒడ్డున జరుగుతున్న ఈ ఈవెంట్లో ఓ స్పెషల్ అట్రాక్షన్ ఉందట. నీటిలోంచి ఆదిపురుష్ పోస్టర్‌ను రివీల్ చేసి అందరికీ చూపిస్తారట. యాభై అడుగుల పోస్టర్ అంటూ అంచనాలు పెంచేస్తున్నారు. ఇక టీజర్‌ను ప్రదర్శించే స్క్రీన్‌ను కూడా చూపిస్తున్నారు. వేదిక కోసం జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

ఇప్పటికే ఆదిపురుష్‌ టీం అయోధ్యలో అడుగుపెట్టేసింది. ప్రభాస్, ఓం రౌత్, కృతి సనన్ వంటి వారి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా రికార్డులను బద్దలు కొట్టేందుకు రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు టీజర్ వస్తుందా? అని అభిమానులే కాకుండా సగటు సినీ ప్రేమికుడు ఎదురుచూస్తున్నారు.

ఆదిపురుష్‌ విషయంలో ప్రతీ అప్డేట్ కోసం ఓ ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏడు గంటల 11 నిమిషాలకు అప్డేట్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. నేటి సాయంత్రం కూడా అదే సమయానికి టీజర్‌ను లాంచ్ చేయబోతోన్నారు. మరి టీజర్ ఎలా ఉంటుంది.. అంచనాలను అందుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.

ఆల్రెడీ ఆదిపురుష్ పోస్టర్ మీద ఎన్ని రకాల అభిప్రాయాలు వెల్లిబుచ్చారో అందరికీ తెలిసిందే. రాముడిగా ప్రభాస్ సరిగ్గా కనిపించలేదని కొందరు, రాముడికి మీసాలుంటాయా? అని ఇంకొందరు.. నెగెటివ్ కామెంట్లు చేశారు. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం అదిపురుష్ లుక్ అదిరిపోయిందంటూ ఫుల్ ఖుషీ అయ్యారు. మరి టీజర్‌ను చూశాక డార్లింగ్ అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
 

Also Read : పెళ్లి సంగతులు చెప్పిన చిరు.. తలపట్టేసుకున్న సురేఖ

Also Read : Sita Ramam-Mrunal Thakur : 'సీత' కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. వ్యభిచార గృహంలో రెండు వారాలున్నానంటోన్న మృణాల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News