పవర్ స్టార్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇదే..!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తన అభిమానులకు న్యూ ఇయర్ కానుక ఇచ్చేసారు. తాను పాడిన పూర్తి పాటను అభిమానుల కోసం ఈ రోజే విడుదల చేశారు.

Last Updated : Dec 31, 2017, 08:15 PM IST
పవర్ స్టార్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇదే..!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తన అభిమానులకు న్యూ ఇయర్ కానుక ఇచ్చేసారు. తాను పాడిన 'కొడకా కోటేశ్వరరావ్' అనే పూర్తి పాటను అభిమానుల కోసం ఈ రోజే విడుదల చేశారు. ఆయన నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలోని పాటను యూట్యూబ్‌లో విడుదల చేయగా.. ఇప్పటికే అది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటీవల ఈ పాట టీజర్‌ను విడుదల చేయగా... కొత్త సంవత్సర సందర్భంగా పూర్తి పాటను ఆదివారం సాయంత్రం నిర్మాతలు విడుదల చేశారు.

‘బాబూ తుకారం ఒక గ్లాసు మిరియాల పాలు.. కర్చు అనుకోకపోతే రెండు యాలక్కాయలు కూడా తగిలించవోయ్‌ కుమ్మేద్దాం.. కొడకా కోటేశ్వరరావా..శర్మగారు నేను ఏమి పాడుతున్నాను. మీరేమి వినిపిస్తున్నారు..’ అంటూ ఫుల్ జోష్‌‌తో సాగే ఈ పాట అభిమానులకు ఇస్తున్న కిక్ అంతా ఇంతా కాదు. గతంలో ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా..’ అనే పాట పాడి ప్రేక్షకుల్ని అలరించిన పవన్ ఇప్పుడు మరో పాటతో తన ఫ్యాన్స్‌కు రియల్ ట్రీట్ ఇచ్చారనడంలో సందేహం లేదు. జనవరి 10న ‘అజ్ఞాతవాసి’  ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న విషయం తెలిసిందే. 

  

Trending News