Gehana Vasisth: పోర్నోగ్రఫీ కేసులో గెహనా వశిస్ట్ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కొట్టివేత

Gehana Vasisth anticipatory bail plea in Pornography films racket: పోర్నోగ్రఫీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గెహనా వశిష్ట్. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించిన కోర్టు. గెహనా వశిష్ట్‌కు వ్యతిరేకంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల వాదన.

Last Updated : Aug 12, 2021, 10:58 PM IST
  • పోర్నోగ్రఫీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గెహనా వశిష్ట్ (Actress Gehana Vasisth).
  • ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించిన కోర్టు (Gehana Vasisth anticipatory bail plea).
  • గెహనా వశిష్ట్‌కు వ్యతిరేకంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల వాదన (Mumbai police).
Gehana Vasisth: పోర్నోగ్రఫీ కేసులో గెహనా వశిస్ట్ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కొట్టివేత

Gehana Vasisth anticipatory bail plea: పోర్నోగ్రఫీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన బాలీవుడ్ సినీ నటి, మోడల్ గెహనా వశిస్ట్ దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు కొట్టివేసింది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది. దీంతో పూర్తి వివరాలతో కోర్టు నుంచి కాపీ అందిన తర్వాత తాము ముంబై హై కోర్టును ఆశ్రయిస్తామని గెహనా వశిష్ట్ (Actress Gehana Vasisth) తరపు అడ్వకేట్ మీడియాకు తెలిపారు. 

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా (Shilpa Shetty's husband Raj Kundra) ఆరోపణలు ఎదుర్కొంటున్న పోర్నోగ్రఫీ కేసుకు సంబంధించిన మరో వ్యవహారంలో జులై 27న గెహనా వశిష్ట్‌పై మూడో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ కంటే ముందుగా ముందస్తు బెయిల్ తెచ్చుకునేందుకు గెహనా వశిష్ట్ ముంబైలోని లోకల్ కోర్టును ఆశ్రయించింది. అయితే, ఈ కేసులో మరో కొత్త బాధితుడు ఆమెకు వ్యతిరేకంగా తమను ఆశ్రయించినందున ఆమెను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, అందువల్ల ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దంటూ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టుకు తెలిపారు. 

Also read : Shilpa Shetty, Sunanda Shetty: వెల్‌నెస్ బిజినెస్‌లో చీటింగ్ కేసులో శిల్పా శెట్టి, తల్లి సునంద శెట్టిపై FIR

పోలీసుల వాదన విన్న కోర్టు గెహనా వశిష్ట్ ముందస్తు బెయిల్‌ను తిరస్కరిస్తున్నట్టు స్పష్టంచేసింది. పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాకు గెహనా వశిష్ట్‌కు (Gehana Vasisth viral photos gallery) మధ్య ఉన్న వ్యాపార సంబంధాలపైనే ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also read : రాజ్ కుంద్రాకు బెయిల్ ఇస్తే పారిపోయే ప్రమాదం: పోర్నోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News