అది నా కల..ఇన్నాళ్లకు పూర్తయింది : పూజా హెగ్డే

టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ రాణిస్తున్న నటి పూజా హెగ్డే. మోస్ట్ ఎలిజుబుల్ బ్యాచ్‌లర్ హిట్‌తో మోస్ట్ నీడెడ్ హీరోయిన్‌గా మారిపోయింది ఈ బుట్టబొమ్మ. ఇప్పుడు తన జీవిత కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 23, 2021, 03:55 PM IST
అది నా కల..ఇన్నాళ్లకు పూర్తయింది : పూజా హెగ్డే

టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ రాణిస్తున్న నటి పూజా హెగ్డే. మోస్ట్ ఎలిజుబుల్ బ్యాచ్‌లర్ హిట్‌తో మోస్ట్ నీడెడ్ హీరోయిన్‌గా మారిపోయింది ఈ బుట్టబొమ్మ. ఇప్పుడు తన జీవిత కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా విన్పిస్తున్న పేరు పూజా హెగ్డే(Pooja Hegde). అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఆమె తాజా చిత్రం. బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఇక ఆమెకు తిరుగులేకుండా పోయింది. అందుకే బుట్టబొమ్మకు వరుస ఆఫర్లు వచ్చేస్తున్నాయి.ఈమె నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్(Radheshyam) విడుదలకు సిద్ధమౌతోంది. లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని అందర్నీ ఆకర్షిస్తోంది. ఇటీవలే ఆచార్య, రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని కొద్దిరోజులు మాల్దీవుల పర్యటన ఎంజాయ్ చేసొచ్చింది. ఖాళీగా ఉండి..కొన్ని సెట్స్ ఫోటోల్ని షేర్ చేసింది. ఓ ఫోటో షేర్ చేస్తూ..ఇన్నాళ్లకు తన కల నెరవేరిందంటూ ట్వీట్ చేసింది.

ఓ లెజెండరీతో కలిసి వర్క్ చేసిన సెట్ ఫోటోను షేర్ చేసింది. ఆ లెజండరీ ఎవరో కాదు బిగ్‌బి అమితాబ్ బచ్చన్. లెజెండ్ అమితాబ్ బచ్చన్‌తో(Amitabh Bachchan)కలిసి పని చేయాలి, షూటింగ్‌లో పాల్గొనాలనేది తన సుదీర్ఘకాలిక కల అని చెబుతోంది. తన కలల లిస్ట్‌లో ఇక టిక్ పెట్టుకోవచ్చంటోంది. అమితాబ్‌తో కలిసి పని చేయాలనే కోరిక నెరవేరిందంటోంది. అయితే ఈ ఫోటో ఏదైనా సినిమాలోదా లేదా యాడ్‌లోదా అనేది ఇంకా తెలియదు. 

Also read: 'బంగార్రాజు' టీజర్ వచ్చేసింది.. నాగచైతన్య లుక్ అదుర్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News