Pooja Hegde Hot Photos: బాడీ కాన్ డ్రెస్సులో పూజా అందాలు.. మత్తెక్కిస్తూ కవ్విస్తోందిగా!

Pooja Hegde Hot Photos: కిసీ కా భాయ్ కిసి కా  జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పూజా హెగ్డే ఆ సినిమా ప్రమోషన్స్ లో తిరుగుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక టైట్ ఫిట్ డ్రెస్ ఫొటో షూట్ విపరీతంగా వైరల్ అవుతోంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 11, 2023, 08:07 PM IST
Pooja Hegde Hot Photos: బాడీ కాన్ డ్రెస్సులో పూజా అందాలు.. మత్తెక్కిస్తూ కవ్విస్తోందిగా!

Pooja Hegde Looking Damn Hot in Sleeveless Maxi Dress: కన్నడ భామ పూజా హెగ్డే పుట్టింది ముంబైలో కావడంతో చిన్ననాటి నుంచే సినిమాల మీద విపరీతమైన ఆసక్తి పెంచేసుకుంది. అలా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ముందుగా తమిళంలో ఒక సినిమా ద్వారా హీరోయిన్గా లాంచ్ అయింది. తర్వాత హిందీ, తెలుగు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. తెలుగులో దువ్వాడ జగన్నాథం సినిమా తర్వాత పూజా హెగ్డే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు.

తెలుగులో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ఈ భామ దూసుకుపోతోంది.  ఇక ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇతర హీరోయిన్లకు పోటాపోటీగా సినిమా అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. నిజానికి గత ఏడాది ఆమె చేసిన ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీసు వద్ద సరిగా పెర్ఫామ్ చేయలేదు. కానీ ఆమె మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది.

Also Read: Allu Arjun vs NTR: రామ్ చరణ్, చిరంజీవి కంటే ఎన్టీఆర్ ఎక్కువయ్యాడా? కొత్త వివాదానికి కారణమవుతున్న 'బావ'?

ఈ భామ ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 28 సినిమాలో భాగమైంది. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న కిసీ కా భాయ్ కిసి కా  జాన్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటుగా తెలుగు నుంచి వెంకటేష్ కూడా నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకులలో కూడా అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈమ ధ్య కాలంలో విడుదలైన బతుకమ్మ పాటతో పాటుగా ఏంటమ్మా అంటూ సాగుతున్న సాంగ్ లో రామ్ చరణ్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాని తెలుగులో కూడా దాదాపుగా రిలీజ్ చేయబోతున్నారనే విషయం క్లారిటీ వచ్చేసింది.

ఇక త్వరలోనే రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్న ఈ భామ తాజాగా ఒక హాట్ ఔట్ఫిట్ లో మెరిసింది. పూర్తిస్థాయి బాడీ టైట్ డ్రెస్ లో ఆమె అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇంకేముంది కుర్ర కారు ఆమె అద్భుతంగా ఉందంటూ ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోల మీద మీరు కూడా ఒకసారి లుక్కు వేసేయండి మరి.

Also Read: Rajamouli weapons list: సింగమలై కత్తి నుంచి బాహుబలి కత్తి దాకా.. జక్కన్న సృష్టించిన ఆయుధాలు చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News