PS-1 Total Collections: రూ. 500 కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించిన పొన్నియిన్ సెల్వన్-1

Ponniyin Selvan-1 Total Collections: పొన్నియిన్ సెల్వన్ -1 సినిమా సక్సెస్ అవడంతో పాటు రూ. 500 కోట్లు వసూలు చేసిందన్న నిజాన్ని చిత్ర యూనిట్ సైతం నమ్మలేకపోతోంది. ఇదే విషయమై చియాన్ విక్రమ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ఇది కలా లేక నిజమా అన్నట్టు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తంచేశాడు. 

Written by - Pavan | Last Updated : Nov 19, 2022, 11:19 AM IST
  • థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న పిఎస్-1
  • 50 రోజుల్లో 500 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన మణిరత్నం సినిమా
  • పొన్నియిన్ సెల్వన్ -1 సినిమా సక్సెస్‌పై ఆనందంలో మునిగి తేలుతున్న చిత్ర యూనిట్
PS-1 Total Collections: రూ. 500 కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించిన పొన్నియిన్ సెల్వన్-1

Ponniyin Selvan-1 Total Collections: పొన్నియిన్ సెల్వన్ -1 మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీతో రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేసిన పొన్నియిన్ సెల్వన్ -1 మూవీ పాన్ ఇండియా ఆడియెన్స్‌నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేసి మెప్పించింది. సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ రిలీజైన పిఎస్ -1 మూవీ నేటితో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా 500 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. తమిళంలో గతంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా శంకర్ డైరెక్ట్ చేసిన రోబో 2.0 మూవీ తర్వాత మళ్లీ ఆ ఘనత సొంతం చేసుకున్న ఏకైక తమిళ సినిమా పొన్నియిన్ సెల్వన్ -1 మూవీ రికార్డ్ సొంతం చేసుకుంది. దీంతో పిఎస్ -1 మూవీ యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

చియాన్ విక్రమ్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జయం రవి, కార్తి, త్రిషతో పాటు ఇంకెంతో మంది ప్రముఖ నటీనటులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన పొన్నియిన్ సెల్వన్ -1 మూవీ 50 రోజులు పూర్తి చేసుకుందని, ఇంకా సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతోందని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. 

 

పొన్నియిన్ సెల్వన్ -1 సినిమా సక్సెస్ అవడంతో పాటు రూ. 500 కోట్లు వసూలు చేసిందన్న నిజాన్ని చిత్ర యూనిట్ సైతం నమ్మలేకపోతోంది. ఇదే విషయమై చియాన్ విక్రమ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ఇది కలయా లేక నిజమా అన్నట్టు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తంచేశాడు. ఇది కల కాదు నిజమే అని చెప్పడానికి ఎవరైనా తనని గిల్లండి అంటూ విక్రమ్ తన ట్వీట్‌లో సరదాగా తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. 

 

2022 లో బాహుబలి లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఆర్ఆర్ఆర్ , కేజీఎఫ్ 2 చిత్రాల తరువాత దక్షిణాదిన మళ్లీ అంతటి ఖ్యాతి గడించి రూ. 500 కోట్ల మార్క్ దాటిన చిత్రం పొన్నియిన్ సెల్వన్ -1 మూవీనే కావడం విశేషం. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కేజీఎఫ్ 2 చిత్రాలు రూ. 1000 కోట్ల కలెక్షన్స్ మైలురాయి దాటగా పొన్నియిన్ సెల్వన్ -1 చిత్రం ప్రస్తుతం 500 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటి ముందుకు దూసుకుపోతోంది. 

పొన్నియిన్ సెల్వన్ -1 చిత్రంతో పాటే సీక్వెల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న మణిరత్నం.. 6 నుండి 9 నెలల విరామంతో పొన్నియిన్ సెల్వన్ -2 మూవీని కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. మొత్తానికి భారతీయ చలన చిత్ర రంగంలో ఎన్నో హిట్ సినిమాలు అందించి దర్శకుడిగా తనకంటూ ఒక గొప్ప ఇమేజ్ సొంతం చేసుకున్న మణిరత్నంకు ఎప్పటి నుంచో సరైన బ్లాక్ బస్టర్ తగడం లేదు. తన గత చిత్రాల రేంజ్ హిట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మణిరత్నంకు ( Mani Ratnam ) పిఎస్-1 సినిమా ఆ లోటును పూడ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాలీవుడ్ సినిమాల కంటే దక్షిణాది నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమాలే ఎక్కువ సత్తా చాటుకుంటున్నాయని పొన్నియిన్ సెల్వన్-1 మూవీతో మరోసారి ప్రూవ్ అయింది. రికార్డుల పరంగా ఇది కూడా ఒక రకంగా పిఎస్-1 మూవీకి బాగా కలిసొచ్చే అంశమైంది.

Also Read : Das Ka Dhamki - Trailer: ఫ** ఆఫ్ అంటూ రెచ్చిపోయిన విశ్వక్.. గెటవుట్ పదాన్ని కూడా వదల్లేదుగా !

Also Read : Kriti Kharbanda Pics: కృతి కర్బందా హాట్ ట్రీట్.. సిల్క్ చీరలో అన్ని చూపించేస్తుందిగా!

Also Read : Balakrishna Fans: బాలకృష్ణ ఫాన్స్ రచ్చ.. మహేష్ బాబు థియేటర్ ధ్వంసం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News