Mangalavaram Movie Release Date: ఆర్ఎక్స్ 100 బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. శర్వానంద్ 'మహా సముద్రం' సినిమా తరువాత ఆయన దర్శకత్వంలో రూపొందిన మూవీ 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించగా.. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాయల్ రాజ్‌పుత్ ఫస్ట్ లుక్‌కు సినీ ప్రియుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో చిత్రబృందం గుడ్‌న్యూస్ చెప్పింది. నవంబర్ 17న తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.
డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ.. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని తెలిపారు. పాయల్ రాజ్‌పుత్ పాత్రను చూసి ప్రేక్షకులు షాక్‌కు గురవుతారని అన్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా మంగళవారం సినిమాను డిజైన్ చేసినట్లు వెల్లడించారు. సినిమాలో ఎవరు మంచి..? ఎవరు చెడు..? అనేది కనిపెట్టలేని విధంగా కథనం ముందుకు సాగుతుందన్నారు. పాత్రల ఆధారంగా తీసిని చిత్రం ఇది అని.. థియేటర్లలో ప్రేక్షకులకు డిఫరెంట్ థ్రిల్ అందిస్తుందని చెప్పారు. నవంబర్ 17న ఆడియన్స్ ముందుకు తీసుకున్నట్లు తెలిపారు.
ప్రొడ్యూసర్లు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ మాట్లాడుతూ.. అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగులో కొత్త ట్రెండ్ సెట్ చేశారని అన్నారు. ఇప్పుడు 'మంగళవారం'తో కూడా మరో సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారని చెప్పారు. ఇదొక డిఫరెంట్ అటెంప్ట్ అని.. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ ట్రై చేయని విధంగా అజయ్ భూపతి తీశారని తెలిపారు. నవంబర్ 17న మంగళవారం మూవీని చూసిన ప్రేక్షకులు కూడా ఆ మాటే చెబుతారని అన్నారు.
99 రోజులు షూటింగ్ చేశామని.. ఇందులో 51 రోజులు రాత్రివేళల్లోనే షూట్ చేసినట్లు వెల్లడించారు. ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మించామని.. హేమాహేమీలైన సాంకేతిక నిపుణులు సినిమాకు పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కాంతార సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న అజనీష్ లోక్‌నాథ్ ఎక్స్‌ట్రాడినరీ మ్యూజిక్ అందించారని.. నేషనల్ అవార్డు విజేత ఎంఆర్ రాజా కృష్ణన్ సౌండ్ డిజైనర్‌గా పని చేస్తున్నారని తెలిపారు. షూటింగ్ పార్ట్ పూర్తయిందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే ట్రైలర్ విడుదల తేదీ వెల్లడిస్తామన్నారు.
శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీ దాశరథి శివేంద్ర అందించగా.. ఎడిటర్‌గా మాధవ్ కుమార్ గుళ్ళపల్లి వ్యవహరించారు. మాటలు తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్ అందించారు.
Also Read: Chandrababu Case Updates: క్వాష్ పిటీషన్‌పై చంద్రబాబుకు ఊరట, రేపు విచారణకు లిస్టింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి