Bheemla Nayak Title Song: "భీం భీం భీం.. భీమ్లా నాయక్"...అదిరిపోయిన టైటిల్ సాంగ్!

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన బీమ్లా నాయక్ టీమ్ టైటిల్ సాంగ్ విడుదల చేసింది. "భీం భీం భీం.. భీమ్లా నాయక్.... బుర్ర రామ్ కీర్తన పాడించే లాఠీ గాయక్" అంటూ సాగే పాట ఆకట్టుకుంటుంది.. మీరే విని ఎలా ఉందో  చెప్పండి 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2021, 03:44 PM IST
  • విడుదలైన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్
  • మ్యూజిక్ అదరగొట్టేసిన థమన్
  • ఆకట్టుకుంటున్న టైటిల్ సాంగ్
Bheemla Nayak Title Song: "భీం భీం భీం.. భీమ్లా నాయక్"...అదిరిపోయిన టైటిల్ సాంగ్!

Bheemla Nayak Title Song: పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పుట్టిన రోజు (Pawan Kalyan Birthday) సందర్భంగా "భీమ్లా నాయక్" (Bheemla Nayak) సినిమా నుండి టైటిల్ సాంగ్ విడుదల చేశారు.  పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో (Pawan Kalyan - Rana Combo) వస్తున్న ఈ సినిమా మళయాళంలో అయ్యప్పనుం కొషియం (Ayyappanum Koshiyum Telugu remake) పేరిట వచ్చిన సినిమాకు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సాగర్ కే చంద్ర డైరెక్ట్ (Sagar K Chandra) చేస్తున్నాడు. 

ఈ రోజు ఉదయం 11:16 గంటలకు పాటను విడుదల చేశారు. "భీం భీం భీం.. భీమ్లా నాయక్.... బుర్ర రామ్ కీర్తన పాడించే లాఠీ గాయక్" (Bheem... Bheem... Bheem... Bheemla Nayak ) అని సాగే ఈ పాటలో పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇరగదీసాడనే  చెప్పాలి.

Also Read: Breaking News: చిన్నారి పెళ్లికూతురు సిరీయల్‌ హీరో "సిద్ధార్థ్ శుక్లా" హఠాన్మరణం

భీమ్లా నాయక్ మూవీ టైటిల్ సాంగ్‌కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ (Ram Jogayya Sastry) అందించగా ఫేమస్ మ్యూజిక్ కంపోజర్ థమన్ మ్యూజిక్ (Thaman) కంపోజ్ చేశాడు. ఇప్పటికే భీమ్లా నాయక్ మూవీ గ్లింప్స్ వీడియో సినిమాపై భారీ అంచనాలు పెంచింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌‌పై నాగ వంశి నిర్మిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండటం మరో విశేషం. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Hurricane Ida: అమెరికాను వణికించిన హరికేన్.. రివర్ నే రివ‌ర్స్ చేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News