Pawan Kalyan with son Akira Nandan: అకీరా నందన్ s/o పవన్ కల్యాణ్.. లేటెస్ట్ ఫోటో వైరల్

Pawan Kalyan viral photo with son Akira Nandan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫోటోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం కొత్తేం కాదు. పవన్ కల్యాణ్‌, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించినంత వరకు ఎప్పుడూ ఏదో ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అలాగే తాజాగా ఇదిగో ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 31, 2021, 08:30 PM IST
Pawan Kalyan with son Akira Nandan: అకీరా నందన్ s/o పవన్ కల్యాణ్.. లేటెస్ట్ ఫోటో వైరల్

Pawan Kalyan viral photo with son Akira Nandan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫోటోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం కొత్తేం కాదు. పవన్ కల్యాణ్‌, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించినంత వరకు ఎప్పుడూ ఏదో ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అలాగే తాజాగా ఇదిగో ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ ఫ్యామిలీ గురించి తెలిసిన వారికి ఎవరికైనా ఈ ఫోటోలో ఆయన పక్కన నిలబడిన కుర్రాడు ఎవరో గుర్తుపట్టడం పెద్ద కష్టమైన పనేం కాదు. అవును.. అకీరా నందన్ (Pawan Kalyan's son Akira Nandan).. పవన్ కల్యాణ్ లేటెస్ట్ గెటప్‌లోనే ఉండగా... తండ్రి పక్కనే తనయుడు అకీరా నందన్ నిలబడిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ అయింది.

 

అకీరా నందన్ (Akira Nandan) 17 ఏళ్ల వయస్సులోనే ఎత్తులో తండ్రిని మించిపోయాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కంటే అకీరా నందన్ ఇంకాస్త ఎత్తు ఉండటం చూసి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, నెటిజెన్స్ ఈ వైరల్ ఫోటో కింద తమదైన స్టైల్లో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. త్వరలోనే అకీరా నందన్ ఫిలిం ఎంట్రీ ఉంటుందేమో అనే ఉహాగానాలకు కూడా ఈ ఫోటో మరోసారి కారణమైంది. పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌లకు (Renu Desai) ఇద్దరు సంతానం కాగా వారిలో కొడుక్కు అకీరా నందన్ అని, ఆ తర్వాత పుట్టిన గారాలపట్టికి ఆధ్యా అని పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

పవర్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. క్రిష్ డైరెక్షన్‌లో పీరియాడిక్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu) అనే సినిమాలో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. ఇదేకాకుండా మరో మూడ్నాలుగు సినిమాలు పవన్ చేతిలో రెడీగా ఉన్నాయి.

Trending News