Boss Party Song: పవన్ మెచ్చిన బాస్ పార్టీ.. ఆ నవ్వులే చెప్పేస్తున్నాయ్ గురూ!

Pawan Kalyan Watches Waltair Veerayya's Boss Party Song: పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నుంచి రేపు విడుదలయ్యే బాస్ పార్టీ సాంగ్ వీక్షించి తన అభిప్రయాన్ని వ్యక్తం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే 

Last Updated : Nov 22, 2022, 09:55 PM IST
Boss Party Song: పవన్ మెచ్చిన బాస్ పార్టీ.. ఆ నవ్వులే చెప్పేస్తున్నాయ్ గురూ!

Pawan Kalyan Watches Chiranjeevi Waltair Veerayya's Boss Party Song: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్ గా వాల్తేరు వీరయ్య సినిమా రూపొందుతోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా లభించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ తీసుకొచ్చేందుకు కూడా రంగం సిద్ధమైంది. వాల్తేరు వీరయ్య మ్యూజిక్ ఆల్బమ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇస్తూ బాస్ పార్టీ అనే ఒక ప్రోమో వదిలారు. ఈ బాస్ పార్టీ ఫుల్ వీడియో సాంగ్ రేపు రిలీజ్ అవుతూ ఉండగా ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వినిపించారు.

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు తన సోదరుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సెట్స్ కు వచ్చారు. దీంతో రేపు విడుదల చేస్తున్న సాంగ్ కి సంబంధించిన వీడియో ఆయనకు వినిపించగా ఆయన విని ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందని ట్యూన్ అత్యద్భుతంగా కుదిరిందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ వెంట హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ ప్రొడ్యూసర్ ఏం రత్నం కూడా ఉన్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ నవంబర్ 23వ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు రిలీజ్ కాబోతోంది.

ఇక వాల్తేరు వీరయ్య సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న మిగతా సినిమాలన్నీ రీమేక్ సినిమాలే కాగా ఇది స్ట్రైట్ సినిమా కావడంతో ఈ సినిమా మీద మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి హిట్ కొడతారని అందరి నోళ్ళు మూయిస్తారని వారంతా అయితే భావిస్తున్నారు. అయితే మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది రిలీజ్ అయితే కానీ చెప్పలేం. 

Also Read: Thalapathy Vijay: ఏదో తేడాగా ఉందే, ఒక్క హిట్టు కూడా లేకుండానే పాన్ ఇండియా నెం1గా ఎలా?

Also Read: Samantha No1: ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్నా పాన్ ఇండియాలో నెం 1.. కాలర్ ఎగరేస్తున్న సమంత ఫాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News