Bheemla Nayak Blitz: భీమ్లా నాయక్.. డానియల్ శేఖర్‌ వచ్చేశాడు.. నేనెవరో తెలుసా? హీరో అంటూ పవర్​ఫుల్ డైలాగ్‌తో అదరగొట్టిన రానా

పవర్‌‌స్టార్‌‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుపాటి కలిసి నటిస్తోన్న చిత్రం భీమ్లా నాయక్‌ (Bheemla Nayak). సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీకి డైరెక్టర్ త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు. ఈ మూవీలో డానియల్ శేఖర్‌గా కనిపించనున్నారు రానా. ఇక మెయిన్‌ లీడ్‌లో నటిస్తోన్న పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన పలు లుక్స్, టైటిల్ సాంగ్ ఇటీవల రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 20, 2021, 08:09 PM IST
  • రానా పాత్రకి సంబంధించి డానియల్ శేఖర్‌ బ్లిట్జ్‌ వీడియో రిలీజ్
  • రానా లుక్, డైలాగ్స్ అదిరిపోయాయి
  • పవన్‌ కల్యాణ్‌కు జతగా నిత్య మీనన్‌
Bheemla Nayak Blitz: భీమ్లా నాయక్.. డానియల్ శేఖర్‌ వచ్చేశాడు.. నేనెవరో తెలుసా? హీరో అంటూ పవర్​ఫుల్ డైలాగ్‌తో అదరగొట్టిన రానా

Pawan Kalyan Rana Daggubatis Bheemla Nayak Blitz of Daniel Shekar out : పవర్‌‌స్టార్‌‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుపాటి కలిసి నటిస్తోన్న చిత్రం భీమ్లా నాయక్‌ (Bheemla Nayak). సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీకి డైరెక్టర్ త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు. ఈ మూవీలో డానియల్ శేఖర్‌గా కనిపించనున్నారు రానా. ఇక మెయిన్‌ లీడ్‌లో నటిస్తోన్న పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన పలు లుక్స్, టైటిల్ సాంగ్ ఇటీవల రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకున్నాయి. 

డానియల్ శేఖర్‌ బ్లిట్జ్‌

రానా పాత్రకి సంబంధించి డానియల్ శేఖర్‌ (Daniel Shekar) బ్లిట్జ్‌ ఒక వీడియోను తాజాగా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో రానా లుక్ అదిరిపోయింది. పంచె కట్టులో మాస్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు రానా. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, రానా డైలాగ్స్ సూపర్బ్. "నీ మొగుడు గబ్బర్‌సింగ్‌ అని స్టేషన్‌లో టాక్‌ నడుస్తోంది. నేనెవరో తెలుసా? ధర్మేంద్ర.. హీరో" అంటూ రానా (Rana) చెప్పిన డైలాగ్‌ అదిరిపోయింది.

 

Also Read : Padmanabhaswamy Temple: ఆర్థిక సంక్షోభంలో అనంత పద్మనాభుడు!

పవన్‌ కల్యాణ్‌కు జతగా నిత్య మీనన్‌

మలయాళంలో సూపర్‌‌హిట్ అయిన అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌కి (ayyappanum koshiyum)రీమేక్‌ భీమ్లా నాయక్. ఇందులో పవన్‌ కల్యాణ్‌కు జతగా నిత్య మీనన్‌, రానా సరసన ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ మూవీ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌, రానాల భీమ్లా నాయక్‌ (Bheemla Nayak) మూవీ వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్స్‌లో రిలీజ్‌కానుంది.

Also Read : Perni Nani : చిరంజీవి అంటే సీఎం జగన్‌కు గౌరవం ఉంది, ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లే ఫైనల్

మరో వైపు భీమ్లా నాయక్‌ బ్లిట్జ్‌ గంటల వ్యవధిలోనే రికార్డులు బద్దలు కొడుతోంది. గంటల వ్యవధిలోనే మిలయన్ల కొద్దీ వ్యూస్.. లైక్స్ వచ్చాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News