పందెం కోడి 2 టీజర్ : విశాల్‌ మళ్లీ విశ్వరూపం చూపిస్తాడా ?

విశాల్‌ మళ్లీ విశ్వరూపం చూపిస్తాడా ?

Last Updated : Aug 31, 2018, 01:38 PM IST
పందెం కోడి 2 టీజర్ : విశాల్‌ మళ్లీ విశ్వరూపం చూపిస్తాడా ?

విశాల్ కెరీర్ ఆరంభంలో అతడిని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా పందెం కోడి. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో విశాల్ చెప్పిన మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెల్స్ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత విశాల్ హీరోగా ఎన్నో యాక్షన్ సినిమాలు వచ్చినప్పటికీ అవేవీ అతడిని పందెం కోడి తరహాలో చూపించలేకపోయాయి. అందులో కొన్ని సినిమాలు భారీ డిజాష్టర్స్‌గానూ నిలిచాయి. ఈ నేపథ్యంలోనే విశాల్ కెరీర్‌లో హీరోగా తెరకెక్కిన 25వ సినిమానే ఈ పందెం కోడి సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. పందెం కోడి సినిమాను డైరెక్ట్ చేసిన ఎన్ లింగుసామినే మళ్లీ ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. మొదటి భాగంలో మీరా జాస్మిన్ విశాల్ సరసన హీరోయిన్‌గా నటించగా ఈ సీక్వెల్లో కీర్తి సురేష్, వరలక్ష్మి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 

విశాల్ సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీతో కలిసి లైకా ప్రొడక్షన్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో పందెం కోడి 2 సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పెన్ స్టూడియోస్, లైట్ హౌజ్ మూవీ మేకర్స్ అనే మరో రెండు పెద్ద నిర్మాణ సంస్థలు ఈ సినిమా నిర్మాణంలో పాల్పంచుకున్నాయి. ఈ సినిమా కానీ హిట్ అయితే, విశాల్‌కి మళ్లీ పూర్వ వైభవం వచ్చినట్టేననే అభిమానులు భావిస్తున్నారు.

Trending News