Record Break: ప్యాన్ ఇండియా మూవీ 'రికార్డు బ్రేక్' మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్..

Record Break : సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలో ఈయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రికార్డ్ బ్రేక్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా  తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఘనంగా నిర్వహించారు. 

Last Updated : Mar 1, 2024, 08:46 PM IST
Record Break: ప్యాన్ ఇండియా మూవీ 'రికార్డు బ్రేక్' మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్..

Record Break :ప్రతి భారతీయుడు గర్వపడేలా దర్శక, నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రికార్డ్ బ్రేక్'.  శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి  నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేసారు. మళ్లీ పుట్టి వచ్చినవా అని సాగే ఈ పాటకి సాబు వర్గీస్ మ్యూజిక్ అందించగా వరికుప్పల యాదగిరి రచించారు. చదలవాడ శ్రీనివాస్ రావు  ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో 8 భాషల్లో ఈ సినిమాను ప్రేఓకుల ముందుకు తీసుకొస్తున్నారు. త్వరలో సెన్సార్ కానుంది.  

ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు  మాట్లాడుతూ :
మా సినిమా రికార్డ్ బ్రేక్ నుంచి సెకండ్ సాంగ్ గా మళ్లీ పుట్టి వచ్చినవా సాంగ్ విడుదల చే. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ కి మంచి స్పందన లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాని మన దేశంలోని మంచి లొకేషన్స్ లో చిత్రీకరించినట్టు చెప్పారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో మా ఆర్టిస్టులు టెక్నీషియన్లు చాలా సపోర్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. చిత్రీకరణ కి సంబంధించిన కొన్ని లొకేషన్ విజువల్స్ మీడియాతో పంచుకున్నారు. అతి త్వరలో గ్రాండ్ గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.ప్రేక్షకులు ఈ సినిమా తప్పకుండా నచ్చుతందన్నారు.

ఈ సినిమాలో నిహార్, నాగార్జున, రగ్ద ఇఫ్తాకర్, సత్యకృష్ణ, సంజన తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్ ముఖ్యపాత్రల్లో నటించారు.

టెక్నీషియన్స్ :
కథ : అంజిరెడ్డి శ్రీనివాస్
సంగీతం : సాబు వర్గీస్
ఎడిటింగ్ : వెలగపూడి రామారావు
డిఓపి : కంతేటి శంకర్
PRO : మధు VR
కో-డైరెక్టర్లు : కూరపాటి రామారావు, గోలి వెంకటేశ్వరులు
నిర్మాణం : చదలవాడ బ్రదర్స్
నిర్మాత : చదలవాడ పద్మావతి
స్క్రీన్ ప్లే & దర్శకత్వం : చదలవాడ శ్రీనివాసరావు
పి ఆర్ ఓ : మధు VR

Also read: Pawan Kalyan: జగన్‌ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు.. జెండా సభలో గర్జించిన జనసేనాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Trending News