Sanjay Dutt: సంజయ్ దత్ గురించి వర్రీ అవుతున్న చిరంజీవి

సంజయ్ దత్ ( Sanjay Dutt ) అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసి చాలా బాధనిపించిందని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ఆందోళన వ్యక్తంచేశారు. ప్రియమైన సంజయ్ దత్ భాయ్‌కి అంటూ ఓ ట్వీట్ చేసిన చిరంజీవి... మీరు ఓ పోరాట యోధుడు అని కొనియాడారు.

Last Updated : Aug 13, 2020, 09:25 PM IST
Sanjay Dutt: సంజయ్ దత్ గురించి వర్రీ అవుతున్న చిరంజీవి

సంజయ్ దత్ ( Sanjay Dutt ) అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసి చాలా బాధనిపించిందని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ఆందోళన వ్యక్తంచేశారు. ప్రియమైన సంజయ్ దత్ భాయ్‌కి అంటూ ఓ ట్వీట్ చేసిన చిరంజీవి... మీరు ఓ పోరాట యోధుడు అని కొనియాడారు. ఇన్నేళ్లకాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని, ఈసారి కూడా మీరు ఈ కష్టాన్ని దాటుకుని విజయంతో తిరిగొస్తారని ఆశిస్తున్నానని చిరు తన ట్వీట్ ద్వారా తన ఆకాంక్షను వ్యక్తపరిచారు. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. Also read : Ayyapanum Koshiyum: మరో రీమేక్ సినిమాలో పవన్ కల్యాణ్ ?

 

ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో సంజయ్ దత్‌ని ఆయన కుటుంబసభ్యులు ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఐతే, ఆస్పత్రిలో జరిపిన వైద్య పరీక్షల్లో సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్ ( Lung cancer ) ఉందని తేలిందని.. క్యాన్సర్ చికిత్స కోసం సంజయ్ దత్ త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్టు ముంబై మీడియాలో వార్తలొస్తున్నాయి. ముంబై మీడియాలో వస్తున్న వార్తలపై సంజయ్ దత్ స్పందించలేదు. Also read : Sanjay Dutt: కేజీఫ్ 2 మూవీ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్

Trending News