Maruva Tarama : యువతను ఆకర్షించే మరువ తరుమా సాంగ్

Adhvaith Dhanunjaya Maruva Tarama యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. మామూలుగా సినిమాకు యూత్ ఆడియెన్స్‌ ఆయువుపట్టులాంటి వాళ్లు. వాళ్లని టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తుంటారు. ప్రేమ కథా చిత్రాలు ఎక్కువగా యూత్‌ను టార్గెట్ చేసి తీస్తుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 8, 2023, 04:03 PM IST
  • నెట్టింట్లో కుర్ర హీరో సినిమా సందడి
  • మరువ తరమా సాంగ్స్ అప్డేట్
  • పాదం పరుగులు తీసే అంటూ హల్చల్
Maruva Tarama : యువతను ఆకర్షించే మరువ తరుమా సాంగ్

Maruva Tarama Songs ప్రతీ సినిమాలో ప్రేమ కథ ఉంటుంది. సినిమా మొత్తం ప్రేమ కథే ఉంటే.. వాటిని యూత్ ఆడియెన్స్‌ ఆదరిస్తూనే ఉంటారు. ఇప్పుడు మరో డిఫరెంట్ కంటెంట్‌తో 'మరువ తరమా' అనే మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . అద్వైత్ ధనుంజయ, అతుల్యా చంద్ర, అవంతిక నల్వాలు నటించిన ఈ మూవీని సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజులు నిర్మిస్తున్నారు. చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. 

తాజాగా ఈ మూవీ నుంచి తాజాగా పాదం పరుగులు తీసే.. సాంగ్‌ను విడుదల చేశారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలో విడుదల చేసిన సాంగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటలో చైతన్య వర్మ రాసిన లిరిక్స్, పాదం పరుగులు తీసే.. అంటూ సింగర్ రోహిత్  గాత్రం హైలెట్ అవుతోంది.

విజయ్ బుల్గనిన్ మెలొడీ ట్యూన్ ఆకట్టుకుంటోంది. ఇక పాటలో చూపించిన అందమైన లొకేషన్స్ స్పెషల్‌గా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద హీరో హీరోయిన్ రొమాంటిక్ సీన్ పాటలో స్పెషల్ అట్రాక్షన్ అయింది. మొత్తంగా చూస్తే ఈ సాంగ్ యూత్‌ను ఆకట్టుకునేలానే ఉంది. 

Also Read:  Samantha : రాత్రంతా అదే పని.. ఉదయమంతా ఇలా.. సమంత పోస్ట్ వైరల్

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు వదిలిన ఫస్ట్ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. యూత్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని ఈ పాట చెప్పకనే చెప్పేస్తోంది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని, మిగతా వివరాలను ప్రకటించనున్నట్టుగా మేకర్లు తెలిపారు. ఈ సినిమాకు రుద్ర సాయి  అందించే విజువల్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి.

Also Read:  Rakul Preet Pics : రకుల్ ప్రీత్ అందాల ప్రదర్శన.. నాభి అందాల విందు.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News