Naatu Naatu Song: ఆస్కార్ ఒక్కటే కాదు, ఆ అవార్డు కూడా గెల్చుకోవాలంటున్న ఏఆర్ రెహమాన్

Naatu Naatu Song: మరి కొద్దిగంటల్లో ఆస్కార్ వేడుక ప్రారంభం కానుంది. తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ పోటీలో ఉండటంతో ఆందరి ఆసక్తి నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ నాటు నాటు పాటపై ప్రశంసలు కురిపించారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 12, 2023, 12:21 PM IST
Naatu Naatu Song: ఆస్కార్ ఒక్కటే కాదు, ఆ అవార్డు కూడా గెల్చుకోవాలంటున్న ఏఆర్ రెహమాన్

నాటు నాటు పాటకు ఆస్కార్ ఒక్కటే కాకుండా గ్రామీ అవార్డు కూడా దక్కాలని ఏఆర్ రెహమాన్ ఆకాంక్షించారు. ఆస్కార్, గ్రామీ అవార్డుల్లో ఏది వచ్చినా భారతదేశ కీర్తి మరింత పెరుగుతుందని ఏఆర్ రెహమాన్ అభిప్రాయపడ్డారు. రెహమాన్ ఆశించినట్టే నాటు నాటు పాట ఆస్కార్‌తో పాటు గ్రామీ అవార్డు గెల్చుకుంటుందని నెటిజన్లు ఆశిస్తున్నారు. 

నామినేషన్లలో ఇండియా నిలిచి 12 ఏళ్లైంది..ఇప్పుుడు ఆర్ఆర్ఆర్ సినిమా పాట ఆ గౌరవం దక్కించుకుంది. ఇక నుంచి ప్రతియేటా భారతీయ సినిమాలు నామినేషన్ దక్కించుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఏఆర్ రెహమాన్. ఈసారి ఆర్ఆర్ఆర్ బలమైన పోటీ ఇస్తోంది, గెలవాలని కోరుకుంటున్నానన్నారు. 

2009లో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగరీలో ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు గెల్చుకున్నారు. అయితే ఇది బాలీవుడ్ మూవీ కావడంతో నాటు నాటు పాటకు అవార్డు వస్తే ఆర్ఆర్ఆర్ సినిమా తొలి భారతీయ సినిమా కానుంది. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుతో పాటు గ్రామీ అవార్డు లేదా ఏ ఒక్కటి గెల్చుకున్నా భారతీయ సంస్కృతిపై అందరూ దృష్టి సారిస్తారని ఏఆర్ రెహమాన్ అభిప్రాయపడ్డారు. గతంలో తాను ఆస్కార్ అవార్డు గెల్చుకున్నా..అది భారతీయ చిత్రం కాకపోవడంతో..నాటు నాటు పాటకు అవార్డు వస్తే తొలి భారతీయ చిత్రం అవుతుందని రెహమాన్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ అకాడమీ మోషన్ పిక్చర్స్, ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో కొనసాగుతున్నారు. 

ఆస్కార్ వేడుక మరి కొద్దిగంటల్లో లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా ప్రారంభం కానున్న ఆస్కార్ 2023 వేడుకలో నాటు నాటు పాట పాడిన గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవల ప్రదర్శన ఉంటుంది. 

Also read: madhuri dixit Mother : మాధురి దీక్షిత్ ఇంట్లో విషాదం.. కన్నతల్లి మరణంతో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News