Oke Oka Jeevitham first look: ఒకే ఒక జీవితం ఫస్ట్ లుక్

Oke Oka Jeevitham first look poster: ఒకే ఒక జీవితం ఫస్ట్ లుక్ విడుదలైంది. శర్వానంద్ కెరీర్‌లో 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా శ్రీ కార్తిక్ అనే ఓ కొత్త డైరెక్టర్ పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. శర్వానంద్‌కి జంటగా పెళ్లి చూపులు బ్యూటీ రితూ (Ritu Varma) వర్మ జంటగా నటిస్తుండగా.. అదే పెళ్లి చూపులు ఫేమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తుండటం విశేషం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 28, 2021, 06:14 PM IST
Oke Oka Jeevitham first look: ఒకే ఒక జీవితం ఫస్ట్ లుక్

Oke Oka Jeevitham first look poster: ఒకే ఒక జీవితం ఫస్ట్ లుక్ విడుదలైంది. శర్వానంద్ కెరీర్‌లో 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా శ్రీ కార్తిక్ అనే ఓ కొత్త డైరెక్టర్ పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. శర్వానంద్‌కి జంటగా పెళ్లి చూపులు బ్యూటీ రితూ (Ritu Varma) వర్మ జంటగా నటిస్తుండగా.. అదే పెళ్లి చూపులు ఫేమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తుండటం విశేషం. ప్రముఖ తమిళ నిర్మాత, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేత ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు (S.R. Prabhu) తొలిసారిగా నిర్మిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇది.

ఒకే ఒక జీవితం మూవీలో అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్టుగానే నగర జీవితంలో ఉండే హంగులను ఓవైపు, గ్రామీణ నేపథ్యంతో పచ్చటి పంట పొలాలతో పల్లెటూరి వాతావరణం మరోవైపు కనిపిస్తుంటే మధ్యలో గిటార్ బ్యాగ్ భుజానికి వేసుకుని నిలబడిన యువకుడిని చూపించేలా ఒకే ఒక జీవితం ఫస్ట్ లుక్ పోస్టర్ (Oke Oka Jeevitham first look poster) డిజైన్ చేశారు. 

Also read : Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ త్వరలో పూర్తి

పల్లెటూరి నేపథ్యంతో గతంలో మంచి చిత్రాలు చేసి మెప్పించిన శర్వానంద్ (Sharwanand) ఈసారి ఒకే ఒక జీవితం మూవీతో ఆడియెన్స్‌కి ఎలాంటి కథను పరిచయం చేయనున్నాడో తెలియాలంటే ఒకే ఒక జీవితం మూవీ (Oke Oka Jeevitham movie) విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.

Also read : Acharya Movie: మరో మైలురాయి చేరుకున్న మెగాస్టార్ Chiranjeevi ఆచార్య సాంగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News