Nithya Menon: బార్ పెడతానంటున్న నిత్యామీనన్... ఆసక్తికరంగా ‘కుమారి శ్రీమతి’ సిరీస్ ట్రైలర్

Nithya Menon Web Series: ప్రస్తుతం నిత్యామీనన్ ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల చివరలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2023, 10:20 PM IST
Nithya Menon: బార్ పెడతానంటున్న నిత్యామీనన్... ఆసక్తికరంగా ‘కుమారి శ్రీమతి’ సిరీస్ ట్రైలర్

Kumari Srimathi web series Trailer: స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ లీడ్ రోల్ లో నటిస్తున్న వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 28న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‍లో సీనియర్ నటి గౌతమి, నిరుపమ్, తిరువీర్, తాళ్లూరి రామేశ్వర రావు, ప్రణీత పట్నాయక్, ప్రేమ్ సాగర్ తదితరులు కీ రోల్స్ చేశారు. లేడి ఓరియెంట్‌ కాన్సెప్ట్‌లో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు గోమతేశ్ ఉపాధ్యే డైరెక్షన్ చేశారు. బార్ పెట్టి తన ఇంటిని దక్కించుకునే పాత్రలో నిత్యామీనన్ నటిస్తోంది. ఈ ట్రైల‌ర్‌ను టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని విడుదల చేశారు. 

అవసరాల శ్రీనివాస్ ఈ వెబ్ సిరీస్‌కు కథను అందించాడు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‍కు చెందిన ఎర్లీ మాన్‍సూన్ టేల్స్, స్వప్నా సినిమాస్ పతాకాలు ఈ సిరీస్‍ను నిర్మించాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ సిరీస్ పై భారీగా అంచనాలను పెంచేశాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News