Nithya Menon as Teacher: స్కూల్ పిల్లలకు టీచర్ గా మారిన నిత్యా మీనన్.. ఎక్కడంటే?

Nithya Menon Turns as Teacher:  మలయాళ భామ నిత్య మీనన్ తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఒక స్కూల్ పిల్లలకు పాఠాలు చెబుతూ కనిపించింది, ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 19, 2023, 09:02 PM IST
Nithya Menon as Teacher: స్కూల్ పిల్లలకు టీచర్ గా మారిన నిత్యా మీనన్.. ఎక్కడంటే?

Nithya Menon Turns as Teacher: మలయాళ భామ నిత్య మీనన్ కెరియర్ మొదటి నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తుంది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఆమె టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించింది. ఆమె చేసిన అలా మొదలైంది గుండెజారి గల్లంతయింది వంటి సినిమాలు ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి.

అయితే గ్లామర్ షో కి కాస్త దూరం మైంటైన్ చేసే ఈ భామ ఎప్పటికప్పుడు తన విభిన్నమైన కథా ఎంపికలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో పాటు వారు గ్లామర్ కి సై అంటున్న నేపథ్యంలో నిత్యామీనన్ కు అవకాశాలు తగ్గాయి, అయితే ఆమె ఏమాత్రం నిరుత్సాహపడకుండా తనకు సూటయ్యే పాత్రలు మాత్రమే చేస్తూ వస్తోంది.

ఆ మధ్య భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నటించిన నిత్యామీనన్ తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఒక స్కూల్ పిల్లలకు పాఠాలు చెబుతూ కనిపించింది. ఇదేంటి నిత్యామీనన్ స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పడం ఏంటి అనుకుంటున్నారా? ఒక సినిమా షూటింగ్ నిమిత్తం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాపురం అనే గ్రామానికి వెళ్లడానికి అక్కడ దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్కూల్ సందర్శించింది.

అక్కడ పిల్లలతో కాసేపు ముచ్చటించడమే గాక వారికి ఇంగ్లీషులో అర్థం అయ్యే విధంగా పాఠాలు చెప్పి వాళ్లను అలరించింది. ఇక వారికి చదువు చెబుతున్న వీడియోను ఆమె ఇన్స్టాలో పోస్టు చేయడంతో వైరలవుతోంది. 'గ్రామాల్లో ఉండే చిన్నారులు బాల్యాన్ని ఆనందంతో గడుపుతున్నారు, వాళ్లు నా చుట్టూ ఉన్నప్పుడు నేనూ సంతోషంగా ఉంటాను' అని నిత్యామీనన్ రాసుకొచ్చింది. ఇక ప్రస్తుతం నిత్యామీనన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

Also Read: Varasudu vs Thegimpu: అక్కడ విజయ్ ను తొక్కేస్తున్న అజిత్.. మన దగ్గర మాత్రం భిన్నంగా కలెక్షన్స్!

Also Read: Vijay Antony Critical Stage: తీవ్ర విషమంగా విజయ్ అంటోనీ ఆరోగ్యం.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News