చిరంజీవి, Nagababu, పవన్ కల్యాణ్‌లలో Niharika కు ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలుసా ?

తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నిహారిక.. తన ఇష్టాయిష్టాలు, అభిరుచులు, పెళ్లి తర్వాత సినిమాలు చేయడం (Niharika wedding) మానేయడానికి వెనుకున్న కారణాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ షోలోనే నాగబాబు గురించి, తన భర్త చైతూ గురించి, పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన కబుర్లు చెప్పింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2021, 04:36 PM IST
  • నిహారికకు మెగా ఫ్యామిలీలో ఎవరంటే ఎక్కువ ఇష్టం ?
  • మెగా ఫ్యామిలీలో నిహారిక ఫేవరైట్ యాక్టర్ ఎవరు ?
  • పెళ్లి తర్వాత సినిమాలు అందుకే మానేయాల్సి వచ్చిందన్న నిహారిక
చిరంజీవి, Nagababu, పవన్ కల్యాణ్‌లలో Niharika కు ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలుసా ?

Niharika comments about Nagababu: చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలుసా ? ఆ ముగ్గురితోనూ ఎంతో అనుబంధం, ఆత్మీయత ఉన్న నిహారికకు ఎవరంటే ఇష్టం అయ్యుంటుందో గెస్ చేయడానికి ప్రయత్నించండి. గెస్ చేశారా ? ఏంటి గెస్ చేయలేకపోతున్నారా ? అయితే ఇదిగోండి జవాబు. 

చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులలో (Nagababu, Chiranjeevi and Pawan Kalyan) నిహారికకు నాగ బాబు అంటేనే ఎక్కువ ఇష్టమట. ఈ విషయాన్ని స్వయంగా తన నోట తనే చెప్పింది. నష్టపోయిన తర్వాత కూడా తిరిగి ఎదగడం, కిందపడిన తర్వాత కూడా అంతేవేగంగా లేచిబడటం వంటివన్నీ ఆయనకే చెల్లు అని తన తండ్రి నాగబాబు గురించి గొప్పగా చెప్పిందామె.

Niharika's interesting comments about Nagababu, Chiranjeevi and Pawan Kalyan

తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నిహారిక.. తన ఇష్టాయిష్టాలు, అభిరుచులు, పెళ్లి తర్వాత సినిమాలు చేయడం (Niharika wedding) మానేయడానికి వెనుకున్న కారణాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ షోలోనే నాగబాబు గురించి ఈ వ్యాఖ్యలు చేసింది.

Also read : Pooja Kannan: హీరోయిన్ గా సాయిపల్లవి సిస్టర్..ఫస్ట్ లుక్ విడుదల..

తాను సినిమాలు చూడటం మొదలయ్యాకా తనకు తన పెదనాన్న చిరంజీని తప్ప ఇంకెవ్వరూ తెలియదని.. ఒక యాక్టర్‌గా పెదనాన్నే తనకు స్పూర్తి అని చెప్పి పెదనాన్నపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకుంది. పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి మాట్లాడుతూ.. తన భర్త చైతూకు (Niharika's husband Chaitanya Jonnalagedda) పెళ్లి తర్వాత తాను సినిమాల్లో నటించడం ఇష్టం లేదని, అందుకే సినిమాలు మానేశానని స్పష్టంచేసింది. 

Niharika-wedding-photos-with-Nagababu-Chiranjeevi-and-Pawan-Kalyan.jpg

ఇటీవల కాలంలో హీరోయిన్లకు పెళ్లి అయినా కెరీర్లో ఏమీ మారడం లేదని, సమంతనే (Samantha life after marriage) అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెబుతూ నిహారిక ఈ వ్యాఖ్యలు చేసింది.

Also read : Rashmi in Bhola Shankar: బంపర్ ఆఫర్ కొట్టేసిన యాంకర్ రష్మీ.. మెగాస్టార్ సినిమాలో ఛాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News