Niharika Konidela: నా పని నేను చూసుకుంటున్న.. నిహారిక కొణిదెల ఏం చెప్పాలనుకుంటోంది?

Niharika Konidela in Vacation: ఈమధ్య కాలంలో అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కుతున్న నిహారిక కొణిదెల ప్రస్తుతానికి తన లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో నిహారిక అసలు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటుంది? అనే చర్చ జరుగుతోంది?

Written by - Chaganti Bhargav | Last Updated : May 28, 2023, 08:22 PM IST
Niharika Konidela: నా పని నేను చూసుకుంటున్న.. నిహారిక కొణిదెల ఏం చెప్పాలనుకుంటోంది?

Niharika Konidela Enjoying Her Own Company: ఈమధ్య కాలంలో నిహారిక కొణిదెల అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ఆమె నిజానికి పెద్దలు కుదిర్చిన వ్యక్తిని వివాహం చేసుకుంది. చైతన్య జొన్నలగడ్డ అనే ఒక పోలీస్ ఆఫీసర్ కుమారుడితో ఆమె వివాహం కొన్నేళ్ళ క్రితం రాచరికపు స్టైల్ లో జరిగింది. కానీ ఆ తర్వాత ఎందుకో ఈ జంట ఎక్కువ కాలం కలిసి కనిపించలేదు.

మధ్యలో గిల్లికజ్జాలు ఆడుకుంటూ ఒకరి సోషల్ మీడియా ఎకౌంట్లను ఒకరు అన్ ఫాలో చేసుకోవడంతో వీరు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు తెర మీదకి వచ్చాయి. అయితే అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయో అనే విషయం క్లారిటీ లేదు. కానీ వారి విడాకులను మాత్రం సోషల్ మీడియా మీడియా ఎప్పుడో కన్ఫర్మ్ చేసింది. ఆ సంగతి అలా ఉంచితే ఈ మధ్యనే నిహారిక డెడ్ పిక్సెల్స్ అనే ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

Also Read: Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?

అయితే ఆమె ప్రస్తుతానికి తన లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయిన ఈ భామ తనకు నచ్చినట్టు బతుకుతున్నానని తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నానని అర్థం వచ్చేలా కామెంట్లు చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోలు, వీడియోలు తాను ఎక్కడ ఎక్కడ తిరుగుతున్నాననే విషయాన్ని షేర్ చేస్తూ మైండింగ్ మైన్ అంటే నా పని నేను చేసుకుంటున్నాను అని అర్థం వచ్చేలా కామెంట్ చేయడంతో నిహారిక అసలు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటుంది? అనే విషయం మీద చర్చ జరుగుతోంది.

ఇక ఈ పర్సనల్ విషయాల గురించి పక్కన పెడితే ఈ భామ ఎక్కువగా తాను మూవ్ ఆన్ అయ్యానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఇక వీరి విడాకుల గురించి అటు మెగా కుటుంబం నుంచి కానీ ఆమె భర్త వైపు నుంచి గాని ఎలాంటి క్లారిటీ అయితే లేదు. 

Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

 

Trending News