Nihal Kodhaty : దూసుకుపోతోన్న నిహాల్ కోదాటి.. 'ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్‌'తో సందడి

The Story Of A Beautiful Girl నిహాల్ కోదాటి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. యంగ్‌ హీరోగా నిహాల్ మంచి కథలను ఎంచుకుంటున్నాడు. పంచతంత్రం, అనుపమతో చేసిన మరో ప్రాజెక్ట్ ఇలా నిహాల్‌కు మంచి క్రేజ్‌ను తీసుకొచ్చి పెట్టాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2023, 03:31 PM IST
  • వరుస సినిమాలతో కొత్త హీరో సందడి
  • నిహాల్ కోదటి కొత్త చిత్రం అప్డేట్
  • ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్
Nihal Kodhaty : దూసుకుపోతోన్న నిహాల్ కోదాటి.. 'ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్‌'తో సందడి

Nihal Kodhaty New Movie ఛార్మీ తో మంత్ర సినిమాను తీసి జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్  సక్సెస్ సాధించింది. రీసెంట్‌గా ఇదే బ్యానర్‌లో మళయాల గ్లామరస్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో బటర్ ఫ్లై చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుపమకు కెరియర్‌లో బెస్ట్ సినిమా నిలిచిపోయింది. దాంతో జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ తో అనుపమకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. అలాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్‌పై మంత్ర సినిమా రచయిత రవి ప్రకాశ్ బోడపాటి డెబ్యూ దర్శకత్వంలో ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అనే సినిమా రాబోతోంది.

ఈ సినిమాను రిలయన్స్ సంస్థ  మే 12న ప్రపంచవ్యాప్తంగా  విడుదలకు చేయనుంది. ఇప్పటికే విడుదలచేసిన ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఓ మర్డర్ కేసును పరిష్కరించడం, దాని చుట్టూ అన్ని రకాల ఎమోషన్స్‌ను రాసుకోవడంతో సినిమా మీద అన్ని వర్గాల వారికి ఆసక్తి ఏర్పడినట్టు అయింది. 

ఈ చిత్రంలో నిహాల్ కోదాటి హీరోగా, దృషికా చందర్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మధునందన్, భార్గవ పోలుదాసు, భావన దుర్గం, సమర్థ యుగ్ , ప్రముఖ జర్నలిస్ట్ దేవి నాగావల్లీ, మెహెర్ శ్రీరామ్ వంటి వారు ఈ సినిమాలో కీ రోల్ పోషించారు. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్‌కు ఆర్ఆర్ ఎంతో స్పెషల్‌గా నిలుస్తుంటుంది. గిడియన్ కట్టా అద్బుతమైన ఆర్ఆర్ అందించారు. 

Also Read:  Akhil Agent : నాగ చైతన్య కంటే దారుణంగా అఖిల్.. ఇక సమంత అయితే అంతకు మించి

"రిలియాన్స్ ఎంటర్ టైన్మెంట్" సంస్థ  ఈ సినిమాను సినిమా చూసి, ఎంతగానో నచ్చి.. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తుండటం సంతోషంగా ఉందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 12న విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా జెన్ నెక్ట్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై హీరోయిన్ అనుపమకు ఉన్న అనుబంధంతో ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ టీమ్‌తో స్పెషల్‌గా చిట్ చాట్ కూడా చేసింది. ప్రస్తుతం ఆ ఇంటర్ వ్యూ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.

Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News