Update on MAA Election Results: రేపే 'మా' ఎన్నికలు.. రేపే ఫలితాల వెల్లడి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 'మా' ఎన్నికల గురించి ముఖ్య ప్రకటన వెలువడింది. అక్టోబర్ 10 న ఎన్నికలు జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తామని ఎన్నికల సహాయ అధికారి నారాయణరావు తెలిపారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 9, 2021, 02:02 PM IST
  • తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న 'మా' ఎన్నికల
  • రేపే 'మా' అసోసియేషన్‌ ఎన్నికలు.. రేపే ఫలితాలు
  • 'మా' పీఠాన్ని గెలిచేసేవరని కొనసాగుతున్న చర్చ
Update on MAA Election Results: రేపే 'మా' ఎన్నికలు.. రేపే ఫలితాల వెల్లడి

MAA elections 2021: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (Movie Artists Association) ఎన్నికలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌బోయే ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 
'మా' అసోసియేషన్‌ పీఠం కోసం ప్రకాశ్‌ రాజ్ (prakash raj), మంచు విష్ణు (manchu vishnu) ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శకు చేసుకుంటున్న సంగతి తెలిసిందే!

హాట్ టాపిక్ గా మారిన మా ఎన్నికల ఫలితాల (MAA Elections Results) గురించి కొత్త అప్‌డేట్ వచ్చేసింది. ఎన్నికల ఫలితాల కోసం ఏ మాత్రం ఎదురుచూడాల్సిన అవసరం లేనే లేదు. 'మా' ఎన్నికల ఫలితాలు రేపు రాత్రికే అనగా అక్టోబర్‌ 10న రాత్రికే ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల సహాయ అధికారి నారాయణరావు (Narayana rao) తెలిపారు 

Also Read: Neelima Shocking comments: సమంత గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన నీలిమ గుణ

'మా' ఎన్నికల పోలింగ్ (MAA Poling) జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో (Jubilee Hills Public School) జరగనుంది, ఎన్నికల కోసం చేసిన ఏర్పాట్లను ఈ రోజు ఉదయం నారాయణరావు సమీక్షించారు. అంతేకాకుండా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరికి పోలింగ్ జరిగే ప్రక్రియ గురించి వివరించారు. 

ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుందని.. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మరియు లెక్కింపు పూర్తైన వెంటనే ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం ఉందని నారాయణరావు తెపిపారు. 

Also Read: Special Train Tickets Hike: రైల్వేశాఖ స్పెషల్ బాదుడు..ఒక్కో ప్రయాణికుడిపై రూ.200-రూ.700 వసూలు

ఎన్నడూ లేని విధంగా ఈ సారి 'మా' ఎన్నిలలు రసవత్తరంగా సాగనున్నాయి. విజేతలు ఎవరు, ఏ ప్యానల్ వాళ్లు గెలవాలవనున్నారు అన్న విషయంపై 'మా' సభ్యులతో పాటూ తెలుగు రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News