Neha Sharma as MP Contestant: 2024 దేశంలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం దేశంలోని అన్ని పార్టీలు సమాయాత్తం అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల పలు విడతల్లో ప్రకటించాయి. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పలువురు హీరోయిన్స్ తొలిసారి తమ లక్‌ను పరీక్షంచుకుంటున్నారు. ఇప్పటికే పశ్చిమ బంగలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 40 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించి సంచలనం రేపారు. ఇందులో బాలయ్య, చిరంజీవిలతో నటించిన రచన బెనర్జీ ఉన్నారు.ఈమె హుగ్లీ నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నారు.
అటు తమిళనాడు నుంచి విరుధ్ నగర్ నుంచి రాధిక శరత్ కుమార్ ఎంపీగా బరిలో దిగనున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా పరిచయమైన 'చిరుత' సినిమాతో పరిచయమైన నేహా శర్మ కూడా ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో తన లక్‌ను పరీక్షించబోతున్నారు. ఈమె బిహార్‌లోని 'భాగల్ పూర్' నుంచి కాంగ్రెస్ తరుపున ఎంపీగా బరిలో దిగబోతున్నట్టు సమాచారం. ఇందు కోసం నేహా శర్మ తండ్రి ప్రముఖ కాంగ్రెస్ నేత అజిత్ శర్మ తన ప్రయత్నాలు ముమ్మురం చేసినట్టు సమాచారం.
ఈ సందర్బంగా అజిత్ శర్మ మాట్లాడుతూ.. భాగల్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది. ఇండి కూటమిలో భాగంగా ఈ సీటు కాంగ్రెస్‌కు ఇస్తే.. తాను కానీ.. తన కుమార్తె నేహా శర్మ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం నేహా శర్మ.. భాగల్ పూర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బిహార్‌లో మొత్తం 40 లోకసభ స్థానాలున్నాయి. ఇప్పటికే బీజేపీ, జేడీయూ, హిందూస్థానీ అవామీ లీగ్, లోక్ జనశక్తి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. అటు ఇండి కూటమిలో ఇంకా సీట్ల పంపకం కొలిక్కి రాలేదు.
హీరోయిన్ నేహా శర్మ విషయానికొస్తే.. రామ్ చరణ్ హీరోగా నటించిన 'చిరుత' సినిమాతో పరిచయమైన ఈమె .. ఆ తర్వాత కుర్రాడు సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, శాండిల్ వుడ్ చిత్రాల్లో నటించి పెద్దగా గుర్తింపు రాలేదు.
Also read: AP Inter Results 2024: ఏపీ ఇంటర్ పరీక్షలు 2024 ఫలితాలు ఎప్పుడు విడుదలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook