Neha kakkar shares house Pics: అప్పుడలా.. ఇప్పుడిలా..!!

బాలీవుడ్ పాపులర్ సింగర్ నేహా కక్కర్... మరోసారి వార్తల్లో నిలిచింది.  బాలీవుడ్‌లో పాటలు పాడుతూ అంచలంచలుగా ఎదిగింది. దిల్ బర్, కాలా చష్మా లాంటి పాటలతో  మంచి పేరు సంపాదించింది. ఓ ప్రముఖ టీవీ చానెల్‌లోని కార్యక్రమం  ఇండియన్ ఐడల్‌లో జడ్జిగా రాణిస్తోంది.  

Last Updated : Mar 7, 2020, 11:20 AM IST
Neha kakkar shares house Pics: అప్పుడలా.. ఇప్పుడిలా..!!

బాలీవుడ్ పాపులర్ సింగర్ నేహా కక్కర్... మరోసారి వార్తల్లో నిలిచింది.  బాలీవుడ్‌లో పాటలు పాడుతూ అంచలంచలుగా ఎదిగింది. దిల్ బర్, కాలా చష్మా లాంటి పాటలతో  మంచి పేరు సంపాదించింది. ఓ ప్రముఖ టీవీ చానెల్‌లోని కార్యక్రమం  ఇండియన్ ఐడల్‌లో జడ్జిగా రాణిస్తోంది. 

Read Also: భారత్‌పై సైబర్ కుట్ర

నేహా కక్కర్. . ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆమె  ఈ మధ్యే ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఓ ఇల్లు కొనుగోలు చేసింది. ఐతే ఆమె గతాన్ని మరచిపోలేదు. గతంలో ఒక చిన్న గదిలో తన తల్లి, తమ్ముడుతో కలిసి ఉండేది. కొత్తగా కొనుగోలు చేసిన బంగ్లా ముందు నిలబడి ఫోటో దిగింది. అంతే కాదు పాత  ఇంటి దగ్గరకు వెళ్లి అక్కడ కూడా ఓ ఫోటో దిగింది. తాను ఈ స్థాయి నుంచి ఇప్పటి వరకు ఎదిగానంటూ. .  గత స్మృతులను గుర్తు చేసుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టుకు నెటిజనుల నుంచి మంచి స్పందన వచ్చింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read Also: 'కరోనా వైరస్' గురించి భయపడాల్సిన అవసరం లేదు..!! 

Trending News