NBK - Akhanda: మహా శివరాత్రి కానుకగా హిందీ ఆడియన్స్ కోసం బాలయ్య 'అఖండ' స్పెషల్ ట్రీట్..

NBK - Akhanda: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా మహా శివరాత్రి కానుకగా హిందీ ఆడియన్స్ కోసం అఖండ సినిమాను ఆ ఫ్లాట్‌ఫామ్‌లో కూడా అందుబాటులోకి రానుంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 6, 2024, 01:51 PM IST
 NBK - Akhanda: మహా శివరాత్రి కానుకగా హిందీ ఆడియన్స్ కోసం బాలయ్య 'అఖండ' స్పెషల్ ట్రీట్..

NBK - Akhanda : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్త చెప్పాల్సిన పనిలేదు.   వీళ్ల కాంబోలో వచ్చిన 'సింహా', లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఈ సినిమాలో బాలయ్య  అఖండ రుద్ర సికిందర్ అఘోరా అనే టైటిల్ పాత్రతో పాటు.. మురళీ కృష్ణ అనే సామాన్య రైతు పాత్రలో నటించి మెప్పించారు. కవల సోదరులు జాతక రీత్యా ఎలా వేరు పడ్డారు.. అందులో ఒకరు అఘోరా ఎందుకు మారాడు. ఆ తర్వాత ధర్మ సంస్థాపనార్ధం మళ్లీ తన ఊరు వచ్చి ఎలా దుష్టులను అంతం చేసాడనేదే 'అఖండ' మూవీ స్టోరీ. ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్ వేదికగా తెలుగు, హిందీ సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు సహా అన్ని భాషల్లో కొన్ని రోజుల పాటు నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగింది. తాజాగా ఈ సినిమా హిందీ రైట్స్‌ను పెన్ స్టూడియోస్ వారు దక్కించుకున్నారు. అంతేకాదు ఈ సినిమాను మహా శివరాత్రి కానుకగా యూట్యూబ్‌లో అఫీషియల్‌గా ప్రసారం చేయనున్నారు.

ఇప్పటికే యూట్యూబ్‌లో బోయపాటి శ్రీను తెరకెక్కించిన సరైనోడు, జయ జానకి నాయకా హిందీ వెర్షన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు జయ జానికి నాయకా.. హిందీ వెర్షన్ మూవీ ఎక్కువ మంది యూట్యూబ్‌లో చూసిన సినిమాగా వరల్డ్ రికార్డ్ కూడా నమోదు చేసింది. అటు సరైనోడు హిందీ వెర్షన్ కూడా అదే రేంజ్‌లో రెస్పాన్స్ తెచ్చుకుంది. మరి అఖండ సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో ఎలాంటి సంచనాలు నమోదు చేస్తుందో చూడాలి.

అఖండ సూపర్ హిట్ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను.. బాలయ్యతో అఖండ 2 ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే బోయపాటి శ్రీను ఈ సీక్వెల్‌కు సంబంధించిన కథను పూర్తి స్థాయిలో రెడీ చేసాడట. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి అఘోరా పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు ఈ సినిమాలో మరో పవర్ఫుల్ పాత్ర కూడా ఉండబోతుందట. ఈ సినిమాలో  ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌లో బాలయ్య ముసలి గెటప్‌లో అది కూడా సాధువు పాత్రలో కనిపించబోతునట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ క్యారెక్టర్కు సంబంధించిన స్కెచ్ రెడీ కూడా చేసాడట. త్వరలో బాలకృష్ణపై ఈ పాత్రకు సంబంధించి టెస్ట్ షూట్ కూడా చేయనున్నారట. ఈ సినిమాను పూర్తిగా సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్‌తో బోయపాటి శ్రీను 'అఖండ'ను మించి రీతిలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలున్నాయట. ఇప్పటికే బాలయ్య డేట్స్‌తో పాటు బోయపాటి శ్రీను డేట్స్ అల్లు అరవింద్ దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీని అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలున్నాయనే టాక్ వినిస్తోంది. ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించడం దాదాపు ఖాయం అని చెబుతున్నారు. ఇప్పటికే కథ విని ఇంప్రెస్ అయిన సంజూ ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పాడట. గతంలో సంజయ్ దత్.. బాలయ్య నటించిన 'లక్ష్మీ నరసింహా' సినిమాను హిందీలో 'పోలీస్ గిరి' పేరుతో రీమేక్ చేసారు. మొత్తంగా సంజయ్ దత్ రాకతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ సినిమాను ఒకేసారి తెలుగు సహా హిందీ ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట.

Also read: Tax Free Incomes: ఈ 5 రకాల ఆదాయాలపై ట్యాక్స్ ఉండదని మీకు తెలుసా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News