NBK - Akhanda: బాలయ్య 'అఖండ'లో బాలయ్య ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో ?

NBK - Akhanda: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే  కదా. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు చిత్ర దర్శకుడు బోయపాటి ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అఖండ 2 టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్ర కోసం బాలీవుడ్ హీరోను తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 30, 2024, 09:22 AM IST
NBK - Akhanda: బాలయ్య 'అఖండ'లో బాలయ్య ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో ?

Nandamuri Balakrishn - Akhanda : నందమూరి బాలకృష్ణ వరుస ఫ్లాపుల్లో ఉన్నపుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ' భారీ హిట్‌గా నిలిచింది. కరోనా పాండమిక్‌ టైమ్‌లో అందరు బడా హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయాలా వద్దా అనే డైలామాలో ఉన్న సమయంలో  విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దీంతో మిగతా హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేసుకోవచ్చనే భరోసా ఇచ్చింది. ఈ సినిమాలో బాలయ్య  అఖండ రుద్ర సికిందర్ అఘోరా అనే టైటిల్ పాత్రతో పాటు.. మురళీ కృష్ణ అనే సామాన్య రైతు పాత్రలో నటించి మెప్పించారు. కవల సోదరులు జాతక రీత్యా ఎలా వేరు పడ్డారు.. అందులో ఒకరు అఘోరా ఎందుకు మారాడు. ఆ తర్వాత ధర్మ సంస్థాపనార్ధం మళ్లీ తన ఊరు వచ్చి ఎలా దుష్టులను అందం చేసాడనేదే ఈ మూవీ స్టోరీ.

ఈ సినిమా క్లైమాక్స్‌లో పాప కోసం మళ్లీ వస్తానని చెప్పడంతో ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని చెప్పారు. ఇపుడు అదే స్టోరీని బోయపాటి శ్రీను తమ టీమ్‌తో కలిసి వండి వార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే కథ రెడీ అయింది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టేనర్ చేస్తున్నారు. ఇందులో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాబీ దేవోల్ నటిస్తున్నారు.

ఆ సినిమా తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలున్నాయని సమాచారం. ఇప్పటికే బాలయ్య డేట్స్‌తో పాటు బోయపాటి శ్రీను డేట్స్ అల్లు అరవింద్ దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీని అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలున్నాయనే టాక్ వినిస్తోంది. ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే కథ విని ఇంప్రెస్ అయిన సంజూ ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక గతంలో సంజయ్ దత్.. బాలయ్య నటించిన 'లక్ష్మీ నరసింహా' సినిమాను హిందీలో 'పోలీస్ గిరి' పేరుతో రీమేక్ చేసారు. మొత్తంగా సంజయ్ దత్ రాకతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

Also read: AP Speaker: ఎమ్మెల్యేలతో స్పీకర్ విచారణ నేడే, అనర్హత వేటు పడేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News