NBK 109 First Glimpse: మ‌హా శివ‌రాత్రి కానుక‌గా అదిరిన బాల‌కృష్ణ కొత్త మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్.. బాల‌య్య ఖాతాలో మ‌రో హిట్టు ప‌క్కా..

NBK 109 First Glimpse: నంద‌మూరి బాల‌కృష్ణ త‌న కెరీర్‌లో ఎన్న‌డు లేనంత జోష్‌లో ఉన్నాడు. అఖండ మూవీతో ప్రారంభ‌మైన బాల‌య్య ప్ర‌భంజ‌నం.. ఆ త‌ర్వాత వీర‌సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి మూవీల‌తో దాదాపు 3 దశాబ్దాల త‌ర్వాత‌ హాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఈ జోష్‌లోనే ఇపుడు బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో నెక్ట్స్ 109 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 8, 2024, 07:09 PM IST
NBK 109 First Glimpse: మ‌హా శివ‌రాత్రి కానుక‌గా అదిరిన బాల‌కృష్ణ కొత్త మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్.. బాల‌య్య ఖాతాలో మ‌రో హిట్టు ప‌క్కా..

NBK 109 First Glimpse: లాస్ట్ ఇయ‌ర్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య‌తో మంచి హిట్ అందించిన బాబీ.. ఇపుడు బాల‌య్య‌ను కొత్త‌గా చూపించ‌బోతున్నాడు. ఈ సినిమాలో బాల‌య్య మ‌రోసారి డాన్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. బాబీతో చేస్తోన్న సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ రోజు మ‌హా శివరాత్రి ప‌ర్వ‌దినం కార‌ణంగా ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల చేసారు. ఈ సినిమా టైటిల్ ఉగాది కానుక‌గా విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు.

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కూలెస్ట్ మరియు క్రూయలెస్ట్ గా కనిపిస్తారని ఇప్పటికే మేకర్స్ ఈ సినిమా విడుద‌లైన టైటిల్ గ్లింప్స్‌లో చూపించారు.  తాజాగా విడుదలైన గ్లింప్స్ దానికి రుజువులా ఉంది. బాలకృష్ణ తన టూల్ బాక్స్‌లో ఆయుధాలతో పాటు మాన్షన్ హౌస్ ఆల్కహాల్ బాటిల్‌ ని తీసుకెళతాడు.  రౌడీలు తన వైపు పరుగెత్తుకుంటూ వస్తుంటే, బాలయ్య కూల్ గా ఆల్కహాల్ తాగడం గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. "ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా?" అని ప్రత్యర్థి గ్యాంగ్ లోని వ్యక్తి అడగగా.. "సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్" అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో  బాలకృష్ణ వేట మొదలుపెట్టడం ఫ్యాన్స్‌కు కిక్ ఎక్కించేలా ఉంది. ఇక ఈ గ్లింప్స్ ను "కల్ట్ సరుకు" అని పేరు పెట్టి ట్రెండ్ చేసారు.

భ‌గ‌వంత్ కేస‌రి మూవీలో బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ విల‌న్‌గా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేసారు. ఈ మూవీతో ఒక‌ప్ప‌టి బాలీవుడ్ యాక్ష‌న్ హీరో బాబీ దేవోల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. వీళ్లిద్ద‌రి మ‌ధ్య సీన్స్ ఈ సినిమాలో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.  డిక్టేట‌ర్, అఖండ‌, వీర‌సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేసరి సినిమాల త‌ర్వాత బాల‌య్య సినిమాకు థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు. జైల‌ర్ ఫేమ్ విజ‌య్ కార్తీక్ సినిమ‌టోగ్ర‌ఫీ అందిస్తున్నారు. నిరంజ‌న్ రెడ్డి ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నారు.  శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఉగాది కానుక‌గా  వెల్లడించనున్నారు.

ఇదీ చదవండి: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా జీతాలు పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News