Nayanthara: రూ.100 కోట్లు ఇస్తానన్న ఆ హీరోతో నటించను.. నయనతార సంచలన కామెంట్స్..

Nayanthara: నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ సినీ ఇండస్ట్రీలో హైయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక పాత్ర నచ్చితే హీరో ఎవరనే సంగతి కూడా అంతగా పట్టించుకోదు నయనతార. కానీ ఓ హీరో సరసన రూ. 100 కోట్లు ఇచ్చినా నటించనని ముఖం మీదే చెప్పేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 26, 2024, 10:39 AM IST
Nayanthara: రూ.100 కోట్లు ఇస్తానన్న ఆ హీరోతో నటించను.. నయనతార సంచలన కామెంట్స్..

Nayanthara: అవును ఆ హీరో తన సరసన నయనతారను నటింపచేయాలని ఎన్నో విశ్వప్రయత్నాలు చేసాడు. కానీ నయన్ మాత్రం అతని సరసన రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా.. నటించనంటే నటించనని తెగేసి చెప్పేసింది. ఇంతకీ ఆ హీరో ఎవరనేగా మీ డౌటు. తమిళనాట శరవణన్ తన ఫస్ట్ మూవీ 'లెజెండ్'లో  హీరోయిన్‌గా నయనతారను అడిగాడు. అందుకోసం నయనతార ఇంటి చుట్టు ఎన్నో సార్లు చెప్పులరిగేలా తిరిగినా.. నయనతార మాత్రం అతని ప్రపోజల్‌కు నో అంటే నో చెప్పేసింది. అప్పట్లో అతను నయనతార అడిగిన దానికంటే డబుల్ రెమ్యునరేషన్ ఇస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడట. కానీ నయనతార మాత్రం రూ. 100 కోట్లు ఇచ్చినా..చేయనని తెగేసి చెప్పేసింది. ఇక చేసేది లేక 'ది లెజెండ్' మూవీలో హీరోయిన్‌గా ఊర్వశి రౌతెలాను తీసుకున్నాడు.

ఈ మూవీ కోసం ఎంతో లావిష్‌గా ఖర్చు పెట్టినా.. ప్రేక్షకులు మాత్రం ఇతని ముఖం చూడడానికి ఇష్టపడలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది. అయినా.. పట్టువదలని విక్రమార్కుడిలా ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానంటూ ఈ మధ్యే చెప్పాడు శరవణన్.

ఇక నయనతార విషయానికొస్తే.. సౌత్ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు దక్షిణాదిని ఒదిలిపెట్టని ఈమె గతేడాది షారుఖ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'జవాన్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  అక్కడ తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఇక నయనతార వివాహాం ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో జరిగింది. వీళ్లిద్దరు మూడేళ్లు డేటింగ్ చేసిన తర్వాత ఒకటయ్యారు. వీళ్లిద్దరు సరోగసీ విధానంలో ఇద్దరు పిల్లలను కన్నారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ప్రస్తుతం సినిమాలు.. షూటింగ్స్‌తో బిజీగా ఉండే నయనతార చెన్నైలో కొన్ని థియేటర్స్‌లో పార్టనర్ షిప్ తీసుకున్నట్టు సమాచారం. దాంతో పాటు ఫ్యూచర్ కోసం ఈమె పలు బిజినెస్‌లో పెట్టుబడులు పెడుతుంది. నయనతార దక్షిణాదిలో హైయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్‌గా ఫోర్బ్స్‌ పత్రికలో చోటు దక్కించుకుంది.

Also Read: Telangana: ముఖ్యమంత్రి అవుతాడని రేవంత్‌ రెడ్డి స్వగ్రామంలోనే ఎవరూ నమ్మలేదు: కేటీఆర్‌

Also Read: Delhi Liquor Scam: 'నాకు చాలా అనుమానాలున్నాయి.. విచారణకు రాలేను': సీబీఐకి కవిత లేఖ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News