అవికాగోర్‌, నవీన్‌ చంద్రల ‘బ్రో’ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌

Bro Movie Trailer release: అన్నయ్యా.. నేను ఉన్నంత వరకూ నువ్వు ఎప్పుడూ ఒంటరి కాదంటూ అవికాగోర్‌ (Avika Gor) చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అన్నాచెల్లెల అనుబంధంపై తెరకెక్కిన మూవీ ఇది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 05:03 PM IST
  • నవీన్‌ చంద్ర, అవికా గోర్‌ అన్నాచెల్లెలుగా నటించిన మూవీ ‘బ్రో’..
  • ‘బ్రో’ ట్రైలర్‌ విడుదల
  • ఆకట్టుకుంటున్న అవికాగోర్‌ డైలాగ్స్
అవికాగోర్‌, నవీన్‌ చంద్రల ‘బ్రో’ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌

Naveen Chandra and Avika Gor’s Telugu film Bro Movie Trailer release: నవీన్‌ చంద్ర, అవికా గోర్‌ అన్నాచెల్లెలుగా నటించిన మూవీ ‘బ్రో’. టి.కార్తిక్‌ డైరెక్షన్‌లో జెజెఆర్‌ రవిచంద్‌ నిర్మించారు. సాయి రోనక్‌, సంజన సారథి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ త్వరలోనే  ప్రముఖ ఓటీటీ వేదికగా విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో శనివారం ‘బ్రో’ ట్రైలర్‌ (Bro Movie Trailer) విడుదలైంది. అన్నయ్యా.. నేను ఉన్నంత వరకూ నువ్వు ఎప్పుడూ ఒంటరి కాదంటూ అవికాగోర్‌ (Avika Gor) చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అన్నాచెల్లెల అనుబంధంపై తెరకెక్కిన మూవీ ఇది. ఈ సినిమా నవంబర్‌ 26న (November 26) సోనీ లివ్‌ వేదికగా రిలీజ్ కానుంది.

ట్రైలర్‌‌ చూస్తుంటే.. అన్నాచెల్లెల్లుగా నవీన్‌ చంద్ర (Naveen Chandra), అవికాగోర్‌ నటన ఆకట్టుకునేలా ఉంది. ఎందుకో తెలీదు నాకు బాగా ఇష్టమైనవన్నీ ఎప్పుడూ నాకు దూరమయ్యాయంటూ... సెంటిమెంట్ డైలాగ్స్‌తో  నవీన్‌చంద్ర అదగొట్టేసినట్లున్నారు మూవీలో. 

Also Read : ఏపీ అసెంబ్లీ ఘటన నా మనసును కలచి వేసింది: జూ. ఎన్టీఆర్

ఈ మూవీ గురించి నవీన్‌ చంద్ర తాజాగా కొన్ని విషయాలు వెల్లడించారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో కష్టపడి ఈ మూవీని పూర్తి చేశామన్నారు. ఇది పూర్తిగా అరకు నేపథ్యంలో సాగే చిత్రమని చెప్పుకొచ్చారు. ఇది రీమేక్‌ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు అభిరుచికి తగ్గట్లుగా... కార్తిక్‌ కథలో చాలా మార్పులు చేశారని వివరించారు నవీన్‌ చంద్ర (Naveen Chandra). 

ఇక.. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో అల్లుకున్న కథతో రూపొందిన ఈ మూవీ మరాఠీలో విజయవంతమైన హ్యాపీ జర్నీ(Happy Journey) కి రీమేక్‌గా రూపొందింది.

Also Read : పెళ్లి కొడుకుగా ముస్తాబైన ఆర్‌‌ఎక్స్ 100 హీరో కార్తికేయ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

 

Trending News