Malli Pelli: భారీ బడ్జెట్ తో మళ్లీ పెళ్లి.. పెద్ద దెబ్బే పడిందే?

Malli Pelli Collections: నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందని అంటున్నారు. ఆ వివరాలోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : May 27, 2023, 06:35 PM IST
Malli Pelli: భారీ బడ్జెట్ తో మళ్లీ పెళ్లి.. పెద్ద దెబ్బే పడిందే?

Malli Pelli failed at the box office: గత కొన్నాళ్లుగా హాట్ టాపిక్ గా మారిన నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి నరేష్ కి ఇప్పటికే మూడు వివాహాలు జరగా ఆయన పవిత్ర లోకేష్ తో ప్రేమలో పడ్డాడని సహజీవనం చేస్తున్నాడని ప్రచారం జరిగింది.

ఈ విషయాన్ని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి రెడ్ హ్యాండెడ్ గా మీడియా కంటికి చూపించడంతో ఇక అప్పటి నుండి నరేష్, పవిత్ర లోకేష్ తాము మంచి స్నేహితులమని భార్యాభర్తలు కాకపోయినా అంతకుమించిన అనుబంధం తమ మధ్య ఉందని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఏకంగా ఒక సినిమా కూడా ఈ వీళ్లు కలిసి చేసేశారు. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో నరేష్ నిర్మాతగా మళ్లీ పెళ్లి అనే సినిమా రూపొందింది. ఈ సినిమాలో కృష్ణ పాత్రలో శరత్ బాబు విజయనిర్మల పాత్రలో జయసుధ నటించగా తమ నిజ జీవిత పాత్రలలో నరేష్, పవిత్ర లోకేష్ నటించారు.

Also Read: Dimple Hayathi Boyfriend : డీసీపీతో గొడవ.. బాయ్ ఫ్రెండ్ సీక్రెట్లు లీక్.. హర్ట్ అయిన డింపుల్ హయతి

ఇక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పాత్రలో దేవి సినిమా హీరోయిన్ వనిత విజయ్ కుమార్ నటించింది. తాను ఎలాంటి పరిస్థితుల్లో పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యాను? తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాను? అలాగే పవిత్ర లోకేష్ తన భర్తకి ఎందుకు దూరమైంది? తన మూడో భార్య రమ్య రఘుపతి తన మీద ఎంత అరాచకాలు చేసింది? లాంటి విషయాలను చూపించడం కోసమే ఈ సినిమా తెరకెక్కించాడు నరేష్.

అయితే సినిమా రిచ్ గా రావాలని పాతిక కోట్లు బడ్జెట్ పెట్టి తీయడమే కాక ప్రమోషన్లకు కూడా భారీగా ఖర్చు పెట్టారు. అయితే తెలుగు కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయినా కానీ థియేటర్లకు వచ్చి చూసేందుకు ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు అయితే పాతిక కోట్లు పెట్టి ఖర్చు చేసి ప్రమోషన్స్ కి కూడా భారీగా ఖర్చు పెట్టడంతో ఈ సినిమా నరేష్ కి భారీగా నష్టాలు తెచ్చి పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 

Also Read: Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

 

Trending News