Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి నందమూరి హీరో వార్నింగ్.. ఏమన్నారంటే!

Jr NTR: ఎన్టీఆర్ ఈ మధ్య జరిగిన టిడిపి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని నందమూరి అభిమానులు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు జరిగిన మరొక సంఘటన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అలానే నందమూరి అభిమానులను షాక్ కి గురి చేసింది.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 22, 2024, 01:41 PM IST
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి నందమూరి హీరో వార్నింగ్.. ఏమన్నారంటే!

Nandamuri Chaitanya Krishna Warning: నందమూరి కుటుంబం నుంచి కూడా చాలామంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తప్ప మిగతావారు అంతగా విజయాన్ని అందుకోలేదు. తారకరత్న, హరికృష్ణ వంటి వారు కూడా హీరోలుగా బాగానే ఆకట్టుకున్నారు కానీ ఎక్కువ సినిమాలలో నటించలేదు. 

కళ్యాణ్ రామ్ కూడా హీరోగా మాత్రమే కాక నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నారు కానీ నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ లు మాత్రం హీరోలు గానే ఇప్పటికీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఒకవైపు చేతినిండా సినిమాలతో తారక్ బిజీగా ఉంటే మరోవైపు బాలకృష్ణ కూడా సూపర్ హిట్ సినిమాలను అందుకుంటూ యువ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నారు.

నందమూరి కుటుంబం నుంచి వచ్చి హీరోగా కేవలం కొద్ది మందికి మాత్రమే పరిచయం ఉన్న వ్యక్తి నందమూరి చైతన్య కృష్ణ. 2003 లో ధమ్ అనే సినిమాతో చైతన్య కృష్ణ హీరోగా వెండి తెరకి పరిచయమయ్యారు. ఆ సినిమాలో జగపతిబాబు కూడా నటించారు.

ఆ సినిమా విడుదలై ఫ్లాప్ అయిన 20 ఏళ్ల తర్వాత చైతన్య కృష్ణ మళ్ళీ బ్రీత్ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్ లోనే జీరో కలెక్షన్స్ సాధించిన సినిమాగా కొత్త రికార్డు కూడా క్రియేట్ చేసింది. 

మరోవైపు చైతన్య కృష్ణ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా సపోర్ట్ చేశారు. చాలా పోస్టులు కూడా షేర్ చేశారు. తాజాగా తనను విమర్శించిన వారిపై చేతనే కృష్ణ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో వైసిపి ఫాన్స్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా చైతన్య కృష్ణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 

“జూనియర్‌ ఫ్యాన్స్ కు ఇదే నా వార్నింగ్‌.. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ లీడర్స్ కొడాలి నాని, వల్లభనేని వంశీ. మీరు సపోర్ట్ చేశారు అని అంటున్నారు. కానీ అసలు మీరు ఎవరు సపోర్ట్ చేయడానికి? మా బొ** కూడా పీకలేరు. నేనుండగా  చంద్రబాబు మావయ్య,  బాలకృష్ణ బాబాయ్‌ని ఎవరూ ఏం చేయలేరు" అంటూ తన ఫెస్ బుక్ లో పోస్ట్ చేశారు నందమూరు చైతన్య కృష్ణ. 

"నా బ్రీత్ సినిమా రిలీజ్ సమయంలో కూడా జూనియర్ ఫ్యాన్స్, వైఎస్సార్ సీపీ ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేశారు. జాగ్రత్త గా ఉండండి" అని వార్నింగ్ ఇచ్చారు కృష్ణ చైతన్య. ఈ వార్నింగ్ పై వైసీపీ ఫ్యాన్స్ పక్కనపెడితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం బాగానే హర్ట్ అయ్యారు. ఈ విషయం మీద రకరకాలుగా స్పందిస్తున్నారు.
 

 

Also Read: AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు ఇవేనా.. పందెం రాయుల్ల బెట్టింగ్ ఇదే..

Also Read: PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News