Unstoppable With NBK : ప్రభాస్‌ను అలా పిలిచిన బాలయ్య.. ఎపిసోడ్ అంతా అంతేనట

Nandamuri Balakrishna Sweet Conversation With Prabhas నందమూరి బాలకృష్ణ చేస్తోన్న అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చేశాడు. తన స్నేహితుడు గోపీచంద్‌తో కలిసి షోకు వచ్చాడు ప్రభాస్.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2022, 04:53 PM IST
  • బాలయ్య షోలో ప్రభాస్ సందడి
  • అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బికే
  • డార్లింగ్ అంటూ బాలయ్య ప్రేమ
Unstoppable With NBK : ప్రభాస్‌ను అలా పిలిచిన బాలయ్య.. ఎపిసోడ్ అంతా అంతేనట

Prabhas in Unstoppable నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకు ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతోన్నాడంటూ గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. మొత్తానికి వీటిపై ఆహా క్లారిటీ వచ్చింది. ఎపిసోడ్‌కు సంబంధించిన స్టిల్స్‌ను ఆహా షేర్ చేసింది. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. షూటింగ్ అనంతరం ప్రభాస్, బాలయ్య ఆఫ్ స్క్రీన్ ముచ్చట్లు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

మామూలుగానే ప్రభాస్ అందరినీ డార్లింగ్ అని పిలుస్తుంటాడు. ఇక ప్రభాస్‌ను సైతం అభిమానులు డార్లింగ్ అనే సంబోధిస్తుంటారు. సెలెబ్రిటీలు సైతం ప్రభాస్ అని కాకుండా డార్లింగ్ అని పిలుస్తుంటారు. డార్లింగ్ అనేది ప్రభాస్‌కు ఊత పదంగా మారిన విషయం తెలిసిందే. కానీ బాలయ్యతో అన్ స్టాపబుల్ షో చేస్తున్న సమయంలో రివర్స్ అయింది. బాలయ్యకు ఊతపదంగా మారిందట.

ప్రభాస్‌ను ఎపిసోడ్ మొత్తం డార్లింగ్ అని పిలుస్తూనే ఉన్నాడట. ప్రభాస్, గోపీచంద్‌ల స్నేహాంలోని మరో కోణాన్ని చూపించేలా ఈ ఎపిసోడ్ ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ప్రభాస్ పెళ్లి గురించి కూడా బాలయ్య కూపీ లాగే ప్రయత్నం చేసినట్టు టాక్. మొత్తానికి ఈ ఎపిసోడ్ వర్కింగ్ స్టిల్సే ఇలా వైరల్ అవుతున్నాయి. ఇక రేపొద్దున ప్రోమో వస్తే.. ఆ తరువాత ఎపిసోడ్ వస్తే.. ఇంకెలా ఉంటుందో చూడాలి.

 

మొత్తానికి బిజీగా ఉన్న ప్రభాస్‌ను మాత్రం ఆహా టీం పట్టేసింది. అసలే ఈ నెల అంతా కూడా ప్రభాస్ తన సలార్, ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండనున్నాడు. ఈ టైంలో ఇలా ఆహా కోసం టైం కేటాయించాడు. అది బాలయ్య బాబు కనుకే ఇలా టైం ఇచ్చినట్టు తెలుస్తోంది.

Also Read : Upasana Konidela Pregnancy : తండ్రి కాబోతోన్న రామ్ చరణ్‌.. గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్

Also Read : Mythri Movie Makers IT Raids : మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటి సోదాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News