Nagashourya: నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్ ఇదే..!

Nagashourya: యంగ్ హీరో నాగశౌర్య 'కృష్ణవ్రింద విహారి' రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాలో షెర్లీ సెటియా కథానాయికగా నటిస్తోంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 12:47 PM IST
Nagashourya: నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్ ఇదే..!

Nagashourya Krishna Vrinda Vihari Release Date: యువ నటుడు నాగశౌర్య (Nagashourya) తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari). అనీష్ కృష్ణ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో షెర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తోంది. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పకులగా వ్యవహారిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక కీలకపాత్ర పోషించారు. వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. అయితే అదేరోజున మరికొన్ని సినిమాలు విడుదలవుతుండడంతో '‘కృష్ణ వ్రింద విహారి'’ చిత్రాన్ని వాయిదా వేసింది చిత్రయూనిట్. అయితే తాజాగా రిలీజ్ డేట్ (Krishna Vrinda Vihari Release Date)ను ఖరారు చేశారు మేకర్స్. ఈ ఏడాది మే 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. 

Also Read: Chiranjeevi Acharya: ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News