Bigg Boss 6 Telugu Winner : గెలిచినా ఓడినట్టు చేసిన నాగార్జున.. రేవంత్‌కు క్షణాల్లో ఆనందం ఆవిరి.. ఓడినా గెలిచేసిన శ్రీహాన్

Bigg Boss 6 Telugu Winner బిగ్ బాస్ ఆరో సీజన్ నిన్నటితో ముగిసింది. అసలే ఈ సీజన్ మీద జనాలు ఎంతో విరక్తితో ఉన్నారు. చెత్త సీజన్‌ అంటూ ఈ ఆరో సీజన్‌ను తిడుతూనే వచ్చారు. ఒక్క కంటెస్టెంట్‌ కూడా పూర్తిగా పర్ఫెక్ట్ అని నిరూపించుకోలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2022, 07:59 AM IST
  • ముగిసిన బిగ్ బాస్ ఆరో సీజన్
  • రేవంత్ గెలిచినా ఓడిపోయాడా?
  • శ్రీహాన్ ఓడినా గెలిచాడా?
Bigg Boss 6 Telugu Winner : గెలిచినా ఓడినట్టు చేసిన నాగార్జున.. రేవంత్‌కు క్షణాల్లో ఆనందం ఆవిరి.. ఓడినా గెలిచేసిన శ్రీహాన్

Bigg Boss 6 Telugu Real Winner బిగ్ బాస్ టీం ఎప్పుడు ఏం చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. దాని చేష్టలు ఎలా ఉంటాయో ఊహించలేం. అంతా బిగ్ బాస్ టీం నిర్ణయాల మేరకే నడుస్తుంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా అది మరోసారి నిరూపితమైంది. రేవంత్‌కు ఎక్కువ ఓట్లు వచ్చినట్టుగా సోషల్ మీడియా ట్రెండ్ చెబుతోంది. మొదటి నుంచీ జరుగుతోంది కూడా అదే. కానీ చివరకు నాగార్జున మాత్రం అబద్దం చెప్పించినట్టుగా ఉంది బిగ్ బాస్ టీం. రేవంత్‌కు తక్కువ ఓట్లు వచ్చాయని, ఈ సీజన్ అసలు విన్నర్ శ్రీహాన్ అని నాగార్జున స్టేజ్ మీద ప్రకటించాడు. అందరినీ ఆశ్చర్యపరిచాడు.

రేవంత్ విన్నర్, శ్రీహాన్ రన్నర్ అవుతారని అందరికీ తెలిసిందే. అందరూ ఇదే ఎక్స్‌పెక్ట్ చేశారు కూడా. అందరూ అనుకున్నట్టుగానే జరిగింది. కానీ అందులో చివరకు ఓ ట్విస్ట్ వచ్చింది. శ్రీహాన్, రేవంత్ మిగిలిన సమయంలో డబ్బుతో బేరాలు ఆడాడు నాగార్జున. నలభై లక్షలకు బేరం కుదిర్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో టైటిల్ వస్తే డబ్బులు రావు.. డబ్బులు వస్తే టైటిల్ రాదు అని ఇద్దరికీ అర్థమైంది. రేవంత్‌కే టైటిల్ వస్తుందని శ్రీహాన్‌కి కూడా లోలోపల అర్థమైంది. అందుకే డబ్బులు తీసుకుని సైడ్ అయిపోయాడు.

దీంతో రేవంత్‌ విన్నర్‌గా మిగిలిపోయాడు. శ్రీహాన్ తప్పుకున్నా, తప్పుకోకపోయినా రేవంత్ విన్నర్ అవుతాడని జనాలు ఫిక్స్ అయ్యారు. రేవంత్ కూడా లోలోపల అదే అనుకుని ఉంటాడు. కానీ నాగార్జున మాత్రం ఇంకోలా చెప్పాడు. రేవంత్ నమ్మకాన్ని, ఆనందాన్ని క్షణాల్లో ఆవిరి చేశాడు. రియల్ విన్నర్ శ్రీహాన్ అని, శ్రీహాన్‌కే ఎక్కువగా ఓట్లు వచ్చాయని చెప్పి రేవంత్‌ను నిండా ముంచాడు. టైటిల్ గెలిచిన ఆనందాన్ని నిమిషం కూడా ఉంచలేదు నాగార్జున.

అటు నలబై లక్షల డబ్బులు గెలుచుకుని ఆనందంలో ఉన్న శ్రీహాన్‌కు నాగార్జున మాటలు మరింతగా ఊపందించినట్టు అయింది. అయితే చివరకు టైటిల్ చేతిలో పట్టుకున్న రేవంత్‌కు ఆనందం కరువైంది. చివరకు విన్నర్‌ బక్రా అయినట్టుగా జరిగింది అక్కడ పరిస్థితి. రన్నర్‌గా నిలిచిన శ్రీహాన్‌కు డబ్బులు వచ్చాయి.

నాగార్జున మాటలతో అతనికే ఎక్కువ ఓట్లు వచ్చినట్టుగా అందరూ ఫిక్స్ అయ్యారు. అంటే రియల్ విన్నర్‌ శ్రీహాన్‌ అని అందరూ అనుకునేలా చేశాడు. అలా బిగ్ బాస్ టీం తమకు నచ్చినట్టుగా ఒకరిని కిందకు, మరొకరిని పైకి లాగేసింది. అయితే శ్రీహాన్‌కు ఓట్లు ఎక్కువగా ఎలా వచ్చాయ్ అని అందరూ ఆశ్చర్యపోతోన్నారు.

అయితే ప్రతీ సారి రన్నర్‌ బక్రా అయ్యేవాడు. ఈ సారి విన్నర్ బక్రా అయ్యాడు. గత సీజన్లలో రన్నర్‌గా నిలిచిన వాడికి ఒక్క రూపాయి కూడా రాలేదు. విన్నర్‌కి మొత్తం డబ్బులో సగం డబ్బులో వచ్చాయి. కానీ ఈసారి రివర్స్‌లో జరిగింది. విన్నర్‌కి రూపాయి రాలేదు.. రన్నర్‌కు లక్షల్లో డబ్బు వచ్చింది.

Also Read : Bandla Ganesh: మిమ్మల్ని మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దుతా.. విజయసాయికి బండ్ల వరుస కౌంటర్లు!

Also Read : Jabardasth Vinod ill: జబర్దస్త్‌ వినోద్‌కి ఏమైంది? ఇలా అయిపోయాడేంటి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News