Nagababu on Garikapati: ఏదో మూడ్లో అని ఉంటారు.. ఇక ఆయనని వదిలేయండి.. మెగా ఫాన్స్ కు నాగబాబు విజ్ఞప్తి!

Nagababu Urges Mega Fans to Leave Garikapati Narasimha Rao: గరికపాటి నరసింహా రావు ఏదో మూడ్ లో ఉండి అలా అని ఉండవచ్చు ఇక ఆయనని ట్రోల్  చేయడం ఆపండి అంటూ నాగ బాబు ట్వీట్ చేయడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 7, 2022, 07:23 PM IST
Nagababu on Garikapati: ఏదో మూడ్లో అని ఉంటారు.. ఇక ఆయనని వదిలేయండి.. మెగా ఫాన్స్ కు నాగబాబు విజ్ఞప్తి!

Nagababu Urges Mega Fans to Leave Garikapati Narasimha Rao: మెగాస్టార్ చిరంజీవి గరికపాటి నరసింహారావు వివాదం అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ వ్యవహారం జరిగిన సమయంలో పెద్దగా ఎవరూ దీని గురించి పట్టించుకోలేదు. కానీ కొణిదెల నాగబాబు ఎవరికైనా తన అన్నయ్యని చూస్తే అసూయ పుడుతుంది అంటూ గరికపాటికి పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇవ్వడంతో మెగా అభిమానులు పలువురు, సినీ ప్రముఖులు కూడా రెచ్చిపోయి గరికపాటి మీద దారుణంగా ట్రోల్స్ అలాగే ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

అయితే ఈ విషయం మీద ఇప్పటికే గరికిపాటి నరసింహారావు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసినట్లు చెబుతున్నారు. అందులో ఆయన క్షమాపణలు కోరుతున్నట్లుగా ఉంది. ఇక తాజాగా ఇదే విషయం మీద నాగబాబు స్పందిస్తూ ‘’గరికపాటి వారు ఏదో మూడ్ లో ఆలా అనివుంటారు ,అయన లాంటి పండితుడు ఆలా అనివుండకూడదని అయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప ,ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు.ఏది ఏమైనా మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని మెగాభిమానులకు నా రిక్వెస్ట్ అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

దీంతో ఇక ఈ వివాదానికి ఇక్కడితో పుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే నటుడు ఉత్తేజ్, దర్శకుడు దేవి ప్రసాద్, నటుడు కౌశిక్, నిర్మాత ఎస్ కే ఎన్ వంటి వారు గరికపాటికి కౌంటర్లు ఇస్తూ ఇప్పటికే ఘాటుగా సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇక్కడితో ఈ వివాదం ఆగిపోతుందని మెగా అభిమానుల భావిస్తున్నారు నాగబాబు ట్వీట్ చేయడంతో మెగా అభిమానులు ఇక గరికపాటిని టార్గెట్ చేయడం ఆపివేయవచ్చు అని అంచనాలు ఉన్నాయి.

Also Read: Garikapati Sorry to Chiranjeevi: చిరంజీవికి గరికపాటి క్షమాపణలు.. సిగ్గుతో తలవంచి చెబుతున్నా అంటూ!

Also Read: Godfather Day 2 Collections: మెగా మాస్ మానియా.. రెండో రోజూ జోరుగా వసూళ్లు.. కానీ అక్కడే తేడా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News