Nagababu Counter: నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా..తమ్మారెడ్డికి నాగబాబు ఘాటు కౌంటర్!

Nagababu Strong Counter : నాగబాబు ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి, ఆర్ఆర్ఆర్ సినిమా మీద తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ ట్వీట్ చేశారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 9, 2023, 11:33 PM IST
Nagababu Counter: నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా..తమ్మారెడ్డికి నాగబాబు ఘాటు కౌంటర్!

Nagababu Strong Counter to Tammareddy Bharadwaj: మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు జనసేనలో కీలక బాధ్యతలు తీసుకుని సోదరుడు పవన్ కళ్యాణ్ కి అండగా నిలబడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తున్న ఆయన తన కుటుంబం గురించి గానీ మెగా ఫాన్స్ గురించి కానీ ఎవరైనా ఏమైనా అంటే వెంటనే వాళ్ళకి సోషల్ మీడియా వేదికగానే కౌంటర్లు ఇచ్చేస్తున్నారు.

తాజాగా నాగబాబు ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే గత రాత్రి ఒకప్పటి నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ఆర్ఆర్ మీద కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు రాబోతున్న ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ సినిమా యూనిటీ 80 కోట్లు ఖర్చు పెట్టిందని ఆ డబ్బుతో మేమైతే ఎనిమిది సినిమాలు తీసి ముఖాన కొడతామని పేర్కొన్నారు. కేవలం ఫ్లైట్ టికెట్స్ కోసమే ఆర్ఆర్ఆర్ టీమ్ అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ ఆయన కామెంట్ చేశారు.

ఆయన చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్న వారు కొందరైతే విభేదిస్తున్న వారు కూడా కొందరు ఉన్నారు. ఇదే అంశం మీద తాజాగా నాగబాబు కామెంట్ చేస్తూ ఇది ఎవరికి చెందాలో వారికి అంటూ ‘’“నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం" (#RRR మీద కామెంటుకు  వై.సీ.పీ. వారి భాషలో సమాధానం)’’ అంటూ నాగబాబు తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు వెంటనే ఆయన షేర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆయన ఫలానా వ్యక్తిని అని ఉద్దేశించి కామెంట్ చేయకపోయినా మెగా అభిమానులు అందరూ తమ్మారెడ్డి భరద్వాజకు భలే కౌంటర్ పడింది అంటూ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో ఆయన కామెంట్ చేసింది తమ్మారెడ్డి భరద్వాజనే అని అందరూ భావిస్తున్నారు. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.

Also Read: Garikapati Comments: రామ్ చరణ్ పై గరికపాటి కామెంట్స్.. వారికి నమస్కారం అంటూ!

Also Read: Satish Kaushik Death: గర్భవతిగా ఉన్న నటిని వివాహం చేసుకుంటానన్న నటుడు మృతి.. అసలు ఏమైందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 

Trending News