Nagababu Shocking Comments on MAA Elections: 'మా' ఎన్నికలు రసవత్తరంగా రాజకీయ పార్టీల మధ్య ఎన్నికలను తలదన్నే విధంగా కొనసాగుతున్నాయి. అటు ప్రకాష్ రాజ్ ప్యానల్ (Prakash Raj Panel), ఇటు మంచు విష్ణు ప్యానల్ (Manchu Vishnu Panel).. ప్రెస్ మీట్ లలో ఒకరిపై ఒకరు ఛాలెంజ్ లతో రెచ్చిపోతున్నారు. మాటల యుద్ధాలతో పాటు సవాళ్లతో ఇండస్ట్రీ హోరెత్తిపోతుంది.
కొత్తగా 'మా' ఎన్నికల్లోకి మెగా బ్రదర్ నాగ బాబు (Nagababu) ఎంటర్ అయ్యారు.. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సపోర్ట్ చేస్తూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. "ప్రకాష్ రాజ్ ఒక ఇండియన్ .. తెలుగు వాడు కాదంటూనే.. ఎందుకు వాళ్ల సినిమాలకి తీసుకుంటారని" ప్రశ్నించారు.
Also Read: RTC Fares Increased: దసరా బాదుడు షురూ.. 50 శాతం చార్జీలు పెంచనున్న APS RTC
"ప్రకాష్ రాజ్ (Prakash Raj) జాతీయ స్థాయిలో పేరున్న నటుడు, చిన్న, పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాల్లో కావలసిన నటుడు. ఒక్కో సినిమాకి కోటీ రూపాయల వరకు తీసుకునే ప్రకాష్ రాజ్.. అంత డబ్బును వదులుకొని, 'మా' కోసం సేవ చేస్తా అని ముందుకు వస్తున్నారు. కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao), బాబుమోహన్ (Mohan Babu)లాంటి వాళ్లు ప్రకాష్ రాజ్ తెలుగు నటుడు కాదు అని ప్రశ్నిస్తున్నారు.. కోట శ్రీనివాసరావు ఇతర భాషల్లో నటించలేదా.. ? ప్రకాష్ రాజ్ అంటే ఎందుకంత చులకనా..??" అని ప్రశ్నించారు
Vote ki 10,000/-🧐🧐@NagaBabuOffl - @prakashraaj #MaaElections2021 pic.twitter.com/0v4ZA9E7AL
— Ahiteja Bellamkonda (@ahiteja) October 6, 2021
"ప్రకాష్ రాజ్ ఒక్కసారి కాదు వరుసగా మూడు సార్లు అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకుంటున్నా... మంచి వ్యక్తిని ఎన్నుకుంటే సభ్యులే గెలిచినట్లు.. ప్రకాష్ రాజ్ 'మా' అసోషియేషన్ (Maa Association) లో ఉండటం, గెలవటం అది అసోసియేషన్ కే మంచిదన్నారు. తెలుగు వాళ్లనే ఎన్నుకోవాలనుంటే..?? మన తెలుగు వాళ్లు కన్నడ, తమిళ భాషలలో నటించటం లేదా.. ?? ఇలాంటి సంబంధం లేని ఆలోచనల నుండి సభ్యులు బయటకి రావాలని నాగబాబు పిలుపునిచ్చారు. ప్రకాష్ రాజ్ కు నేను మద్దతు ఇస్తున్నా... నూటికి నూరు శాతం గెలిపించి తీరుతాం" అని పేర్కొన్నారు.
Also Read: IPL 2021: ప్రాక్టీస్ వీడియో పోస్ట్ చేసిన కోహ్లీ... కన్నుల పండగ్గా ఉందన్న ఆఫ్రిది
"మా ఎన్నికల్లో ఓటేసే సభ్యులకు ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నారని విన్నాను. ఓటింగ్ అయిన మరి కొన్ని రోజుల తరువాత ఇంకొంచెం డబ్బు ఇస్తామని చేతున్నారట.. మా అసోసియేషన్ సభ్యుల ప్రతిష్టను దిగజార్చే కుట్రలు జరుగుతున్నాయి. సభ్యులు ఇలాంటి ప్రలోభాలకు గురికావద్దని మెగా బ్రదర్ నాగబాబు పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి