Naga Vamsi: గుంటూరు కారం నుంచి నేర్చుకున్న నిర్మాత.. ఈసారి ఆ తప్పు చేయలేదుగా!

Tillu Square:  చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ఈ రోజుల్లో ప్రమోషన్స్, ప్రీమియం షోస్ కామన్ అయిపోయాయి.. అయితే రీసెంట్ గా విడుదలైన టిల్లు స్క్వేర్ చిత్రానికి మాత్రం ఎటువంటి ప్రీమియం షోస్ వెయ్యలేదు. దీని వెనక కారణం ఏమిటో తెలుసా?

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2024, 11:37 AM IST
Naga Vamsi: గుంటూరు కారం నుంచి నేర్చుకున్న నిర్మాత.. ఈసారి ఆ తప్పు చేయలేదుగా!

Tillu Square Collections:
ఇటీవల కాలంలో సినిమా విడుదల అవుతుంది అంటే ముందుగా స్పెషల్ ప్రీమియం షోలు వేయడం ట్రెండ్ గా మారింది. విడుదలకు ఒక్క రోజు ముందు లేదా ముందు రోజు అర్ధరాత్రి కానీ పెయిడ్ ప్రీమియర్స్ వేసి ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ ను బాగా క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రీమియం షోస్ కొన్ని సినిమాలకు బాగా కలిసి వస్తుంటే మరోపక్క మరికొన్ని సినిమాలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన 'టిల్లు స్క్వేర్' చిత్రానికి ప్రీమియర్ షోలు వేయకపోవడానికి వెనుక ఓ రకంగా గుంటూరు కారం మూవీ ప్రభావం ఉంది అని టాక్.

మొన్న సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు మూవీ గుంటూరు కారం మూవీ అనుకున్న విధంగా పర్ఫార్మ్ చేయలేకపోయింది.దీనికి ముఖ్య కారణం నైట్ షో తర్వాత కాస్త నెగిటివ్ టాక్ అని తెలుస్తోంది. ఇదే విషయాన్ని గుంటూరు కారం నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ కారణం చేతనే ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్’మూవీకి ప్రీమియం షోస్ వేయలేదు అని టాక్.

డీజే టిల్లు మూవీ కి సీక్వెల్ గా మల్లిక్ రాం డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ మూవీ టిల్లు స్క్వేర్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మొదటి ఆట నుంచి చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా ఉంటాయి అని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ మూవీ కంటెంట్ చూపించి ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రీమియం షో వేయవచ్చు కానీ ఎందుకో నాగ వంశీ దీనికి ఇష్టపడలేదు. అంతేకాదు సినీ ప్రముఖులకు ,మీడియా వారికి కూడా ఎటువంటి స్పెషల్ షోలు ప్రదర్శించలేదు. గుంటూరు కారం మూవీ టైంలో అర్ధరాత్రి షోలు వేయడం వల్లే అనుకున్న ఫలితాలు రాలేకపోయాయని భావించిన నిర్మాత ఈ మూవీ విషయంలో జాగ్రత్త పడ్డారు అని అందరూ అనుకుంటున్నారు.

ఇక 'టిల్లు స్క్వేర్’మూవీ విషయానికి వస్తే మొదటి ఆట నుంచి మాంచి క్రేజ్ సొంతం  చేసుకొని డీసెంట్ థియేటర్ ఆక్యుపేషన్ తో ముందుకు సాగుతోంది. ఈ చిత్రంలో టిల్లు క్యారెక్టర్రైజేషన్ తో పాటు కామెడీ, డైలాగ్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. ప్రీమియం షో వేస్తే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ ఓవరాల్ గా మూవీ మాత్రం బాగా సక్సెస్ సాధించేలా కనిపిస్తుంది. ఈ మూవీ కచ్చితంగా 100 కోట్ల క్లబ్ లో చేరుతుంది అని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Nikhil Siddhartha TDP: హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ సంచలనం.. అనూహ్యంగా టీడీపీలో చేరిక

Also Read: KTR Fire: కేకే, కడియం వంటి వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం: కేటీఆర్‌

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News