Naga Chaitanya: నితిన్.. నాగచైతన్యకి.. అల్లు అర్జున్ స్ట్రాంగ్ దెబ్బ..

December Telugu Releases: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2.. సినిమా.. ఆగస్టులో విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే.. సినిమా ఆగస్టు నుంచి తప్పుకోవాల్సి.. ఉంటుంది. పెండింగ్ ఉన్న సినిమా షూటింగ్ పూర్తి చేసి.. సినిమాని విడుదల చేయడానికి.. చిత్ర బృందానికి ఎంత కాదన్నా..డిసెంబర్ దాకా పడుతుంది అని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే.. ఒక రెండు తెలుగు సినిమాలు. సినిమాలు డిసెంబర్ బరి నుంచి తప్పుకోవాల్సిందే.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 17, 2024, 04:42 PM IST
Naga Chaitanya: నితిన్.. నాగచైతన్యకి.. అల్లు అర్జున్ స్ట్రాంగ్ దెబ్బ..

Pushpa 2 Release Date: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన పుష్ప సినిమా..ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో.. అద్భుతమైన నటన అందించిన బన్నీ ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. 

ప్రస్తుతం ఈ సినిమాకి రెండవ భాగంగా.. తెరకెక్కుతున్న పుష్ప 2 మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న.. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. కానీ సినిమా ఆగస్టు 15న.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలవుతుంది అని చిత్ర బృందం ప్రకటించింది. 

కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే మాత్రం సినిమా.. వాయిదా పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే చిత్ర బృందం సినిమా ఎప్పటికి వాయిదాపడుతుంది అనే విషయంపై మాత్రం.. ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ సెప్టెంబర్ అక్టోబర్ లలో ఆల్రెడీ సినిమాలు ఉన్నాయి. కాబట్టి చిత్ర బృందం.. డిసెంబర్లో సినిమాని విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

క్రిస్మస్ సందర్భంగా పుష్ప 2..సినిమా విడుదల అవకాశం ఎక్కువగా ఉంది. కానీ డిసెంబర్లో రెండు సినిమాలు విడుదలకి లైన్ లో ఉన్నాయి. ఒకటి నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమా కాగా.. మరొకటి నితిన్ నటిస్తున్న రాబిన్ హుడ్. ఒకవేళ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ కి వాయిదా పడితే.. మాత్రం ఈ రెండు సినిమాలు ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశాలు తక్కువే. పుష్ప 2 డిసెంబర్ లో థియేటర్లలోకి వస్తుంది.. అంటే మాత్రం ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ఎడాడికి వాయిదా పడతాయి. 

లవ్ స్టోరీ సినిమా తర్వాత మళ్లీ నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా తండేల్. చందు మొండేటి ఈ సినిమాకి.. దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాకుళంలోని చేపలు పట్టే వాళ్ళ జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. 

మరోవైపు నితిన్ హీరోగా నటిస్తున్న..రాబిన్ హుడ్ సినిమాలో.. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మధ్యనే వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ఫ్లాప్ అయింది. మరి ఈ సినిమాతో.. నితిన్ ఎంతవరకు మెప్పిస్తాడో వేచి చూడాలి. అయితే ఈ రెండు సినిమాల నటీనటులకి..తమ సినిమాలు హిట్ అవ్వడం మాత్రం కీలకం కాబోతోంది. కాబట్టి ఈ రెండు సినిమాలు పుష్ప 2 కి పోటీగా.. అనుకున్న తేదీకి విడుదలయ్యే అవకాశాలు అయితే లేవనే చెప్పుకోవాలి.

Read more; Lovers Jumping into River: నదిలో దూకిన ప్రేమజంట.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మత్స్యకారుడు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News