Naga Chaitanya: తండేల్ కి చిక్కుముడ్లు.. అక్కినేని హీరోకి తప్పని బాధలు!

Naga Chaitanya Thandel: నాగచైతన్య హీరోగా.. చందు మొండేటి దర్శకత్వంలో.. తెరకెక్కుతున్న తండేల్.. సినిమా షూటింగ్ కొద్ది రోజుల్లో.. పూర్తి కాబోతోంది. కానీ సినిమా విడుదల విషయంలోనే.. ఇంకా క్లారిటీ రావడం లేదు. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 22, 2024, 09:00 PM IST
Naga Chaitanya: తండేల్ కి చిక్కుముడ్లు.. అక్కినేని హీరోకి తప్పని బాధలు!

Thandel Release Date: గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లతో నాగచైతన్య.. మార్కెట్ బాగా పడిపోయింది. కస్టడీ సినిమాతో కూడా హిట్ అందుకోలేకపోయినా నాగచైతన్య తాజాగా ఇప్పుడు తన ఆశలన్నీ.. తన నెక్స్ట్ సినిమా తండేల్ మీదే పెట్టుకున్నాడు. 

నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన.. చందు మొండేటి ఈ సినిమాకి.. కూడా దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్యతో రొమాన్స్ చేసిన సాయి పల్లవి.. ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. గీత ఆర్ట్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో నాగచైతన్య కచ్చితంగా హిట్.. అందుకుంటాడని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన.. ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్.. ఈ మధ్యనే విశాఖపట్నంలో పూర్తయింది. షూటింగ్ పూర్తవగానే నాగచైతన్య చెన్నైకి వెళ్ళిపోయారు. 

కొద్దిరోజులు బ్రేక్ తీసుకున్నాక మరొక రెండు షూటింగ్ షెడ్యూల్స్ హైదరాబాద్, ఢిల్లీలో జరగనున్నాయి. ఒకటి రెండు పాటలతో పాటు ఒక షూటింగ్ ఫైటింగ్ సన్నివేశం షూటింగ్ కూడా ఇంకా పెండింగ్లో ఉంది. సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న దేవి శ్రీ ప్రసాద్.. ఇప్పటికే ట్యూన్స్ కూడా ఇచ్చేశారు. సినిమాకి సంబంధించిన పనులను పూర్తయిపోయాయి. 

కానీ అసలు సమస్య విడుదల తేదీతోనే వచ్చి పడింది. డిసెంబర్ 20న సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసుకుంది. కానీ డిసెంబర్ మొదటి వారంలో అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల.. ప్రకటించగా తండేల్ బృందానికి కూడా షాక్..తగిలింది. ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా డిసెంబర్ 20 న విడుదాకి సిద్ధం అవుతూ ఉండటంతో తండేల్ బృందం.. సినిమాని ముందుకో వెనక్కో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. మరి కొద్ది రోజుల్లో చిత్ర బృందం సినిమా విడుదలకి.. సంబంధించిన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో

Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News