Naga Chaitanya Car Collection: ఈ తరం అక్కినేని ఫ్యామిలీ వారసులలో.. తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో నాగ చైతన్య. ఏం మాయ చేసావే సినిమాతో మంచి విజయం అందుకున్న ఈ హీరో ఆ తరువాత కూడా కొన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. ఈ మధ్యనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి తో చైతన్య చేసిన లవ్ స్టోరీ మంచి విజయం అందుకుంది. ఆ తరువాత కూడా కొన్ని చిత్రాలలో కనిపించిన ఈ హీరో.. ప్రస్తుతం మరోసారి సాయి పల్లవి తో తండేలా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. సినిమాల విషయం పక్కన పడితే ప్రస్తుతం నాగచైతన్య కొనుగోలు చేసిన కార్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
కార్లు, బైకుల కలెక్షన్ చైతన్య దగ్గర ఎక్కువగానే ఉంటాయి. చైతన్య కార్లు, బైకుల కొరకు భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం గమనార్హం. ఈ క్రమంలో నాగ చైతన్య తన హై-ఎండ్ కార్ కలెక్షన్‌లో సరికొత్త కారుని యాడ్ చేశారు. కాగా ఈ లగ్జరీ కార్ మరేదో కాదు.. ‘Porsche 911 GT3 RS’. ఈ సిల్వర్ కలర్ పోర్షే 911 GT3 కారుని ఈ హీరో ఈ మధ్యనే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక వెబ్సైట్ ప్రకారం భారతదేశంలో పోర్షే 911 GT3 RS ఎక్స్-షోరూమ్ ధర ₹ 3.51 కోట్లు వరకు ఉండొచ్చని సమాచారం. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో నాగచైతన్య తన కారుతో దిగిన ఫోటోని షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ కార్ ధర తెలుసుకొని తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక ఈ కారు కాకుండా చైతన్య దగ్గర మరెన్నో బైకులు, కార్లు కూడా ఉన్నాయి. నాగచైతన్య దగ్గర ఉన్న ఖరీదైన బైక్ లలో "bmwr9t" ఒకటి. ఈ బైకు కోసం చైతన్య ఏకంగా 20 లక్షల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం. విరాకులు తీసుకోకముందు చైతన్య తన మాజీ భార్య సమంతతో కలిసి ఈ బైక్ పై చక్కర్లు కొట్టగా.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్య దగ్గర ఈ బైక్ తో పాటు దాదాపు 13 లక్షల రూపాయల విలువ చేసే triumph thruxton r బైక్ కూడా ఉంది.
ఇక కార్ల విషయాన్ని వస్తే చైతు దగ్గర ఫెర్రారి ఎఫ్ 430 మోడల్ కారు ఉంది. కారు ధర ఏకంగా కోటీ 75 లక్షల రూపాయలు కావడం విశేషం.ఈ కార్లతో పాటు చైతన్య దగ్గర కోతి రూపాయలు విలువ చేసే మెర్సిడస్ బెంజ్ జీ క్లాస్ జీ663 కారు కూడా ఉంది. అంతేకాకుండా 35 లక్షలు విలువచేసే ఎంవీ అగస్ట ఎఫ్4 సారీ కూడా చైతన్య దగ్గర ఉంది.
Also read: Driving License New Rules: జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్, ఇకపై నో డ్రైవింగ్ టెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి