Naa Saami Ranga: ఆశ్చర్యపరుస్తున్న నా సామి రంగా నాన్ థియేటర్ బిజినెస్... ఏకంగా అన్ని కోట్లు

Naa Saami Ranga Non-theatrical Rights: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రస్తుతం పక్కా మాస్ అవతార్ లో మన ముందుకి నా సామిరంగా సినిమాతో సంక్రాంతికి రానున్నారు. ఈ చిత్రంపై మొదట్లో అంచనాలు లేకపోయినా.. టీజర్ విడుదల దగ్గర నుంచి మాత్రం ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2024, 09:00 AM IST
Naa Saami Ranga: ఆశ్చర్యపరుస్తున్న నా సామి రంగా నాన్ థియేటర్ బిజినెస్... ఏకంగా అన్ని కోట్లు

Nagarjuna Remuneration: సంక్రాంతి పండుగ అంటే…తెలుగువారికి గుర్తొచ్చేది ఊర్లోకి వెళ్లడమే కాదు.. సినిమాలు చూడటం కూడా. అందుకే ప్రతి సంవత్సరం సంక్రాంతి అంటే చాలు కనీసం మూడు.. నాలుగు సినిమాల పైనే విడుదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా మన సీనియర్ హీరోలు అందరూ సంక్రాంతికి తమ సినిమాలు విడుదల చేయాలని సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. వీరిలో ఒకరు నాగార్జున.

సంక్రాంతి సీజన్ లో వచ్చి నాగార్జున ఎన్నో సూపర్ హిట్లు అందుకున్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న నాగార్జున ఈమధ్య కూడా సోగ్గాడే చిన్నినాయన సినిమాని సంక్రాంతికి విడుదల చేసి సూపర్ హిట్ అందుకున్నారు. అయితే తర్వాత నాగార్జున దగ్గర నుంచి వచ్చిన సినిమాలు అన్ని ఫ్లాప్ గానే నిలిచాయి. బంగార్రాజు పర్లేదు అనిపించుకున్న కానీ మిగతా చిత్రాలు మాత్రం డిజాస్టర్లుగా మిగిలాయి. 

అందుకే మరోసారి సంక్రాంతిని నమ్ముకుంటూ ఈసారి నా సామిరంగా అంటూ ప్రేక్షకుల ముందుకు సిద్ధమయ్యారు అక్కినేని హీరో. ఈ చిత్రం ప్రకటించినప్పుడు ఈ సినిమాపై కనీస అంచనాలు కూడా లేవు. అయితే ఈ చిత్రం టీజర్ విడుదలైన దగ్గర నుంచి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు ముఖ్య కారణం ఈ చిత్రంలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ ..రాజ్ తరుణ్ కూడా నటించడం.. అలానే టీజర్ మొత్తం పూర్తిగా సంక్రాంతి స్టఫ్ తో నిండిన సినిమా లాగా ఉండడం.

ఇక ఈ టీజర్ తీసుకొచ్చిన హైప్ తో నాన్ థియేటర్ అమ్మకాలు తెచ్చుకోవడమే కష్టంగా వున్న ఈ రోజుల్లో.. నాగార్జున నా సామి రంగా సినిమా అందరినీ ఆశ్చర్యపరుస్తూ మంచి నాన్ థియేటర్ బిజినెస్ చేసినట్టు వినిపిస్తోంది. ఈ చిత్రం మొత్తం నాన్ థియేటర్ హక్కుల రూపంలో 32 కోట్ల వరకు సాధించినట్లు వినికిడి.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్.. డిజిటల్ హక్కులను మా టీవీ, హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్టు అలానే హిందీ డబ్బింగ్ హక్కులను థర్డ్ పార్టీకి విక్రయించినట్లు తెలుస్తోంది. మొత్తం పైన నాన్ థియేటర్ హక్కులు అన్నీ కలిపి 32 కోట్ల వరకు రికవరీ అయినట్లు తెలుస్తోంది. కాగా నాగార్జున సినిమాకి వరస ప్లాపుల తరువాత కూడా ఇంత బిజినెస్ జరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొత్తం పైన ఇది మొత్తం ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్ పుణ్యమే అంటున్నారు అందరూ.

ఇక చిట్టూరి శ్రీను నిర్మించిన ఈ సినిమాకు కాస్త గట్టిగానే ఖర్చు చేసారట. 45 కోట్ల వరకు ఈ సినిమాకి నిర్మాత ఖర్చుపెట్టినట్టు…ఇక అందులో నాగార్జున రెమ్యూనిరేషన్ నే 12 కోట్ల వరకు వుందని తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పుడు వినిపిస్తున్న నాన్ థియేటర్ బిజినెస్ చూస్తూ ఉంటే.. ఈ చిత్రం మూడు వంతులు రికవరీ చేసేసింది. ఇటీవలి కాలంలో నాగ్ సినిమాకు మంచి బజ్ వచ్చింది అంటే అది ఇదే. మరి ఈ చిత్రం నాగార్జునకి మరో సూపర్ హిట్ అందిస్తుందేమో వేచి చూడాలి.

పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ సినిమాలో ఆశిష్ రంగనాధ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సంక్రాంతి పండగ వేళ మరో నాలుగు సినిమాలతో ఈ సినిమా పోటీ పడబోతోంది. మహేష్ బాబు గుంటూరు కారం.హ వెంకటేష్ సైంధవ్ ..రవితేజ ఈగల్.. తేజ సజ్జ హనుమాన్ నాగార్జున నా సామిరంగా సినిమాకి పోటీగా విడుదల కానున్నాయి.

Also Read: Samyuktha Menon: సంయుక్త మీనన్ పెళ్లి.. వైరల్ అవుతున్న న్యూస్..

Also read: Japan Earthquake Updates: జపాన్ భూకంపంలో 57కు చేరిన మరణాలు, ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News