Music Shop Murthy: అజయ్ ఘోష్ తో చాందినీ చౌదరి.. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్

Music Shop Murthy First Look:  తెలుగులో ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అజయ్ ఘోష్. ఇన్ని రోజులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు ఏకంగా హీరో అయిపోతున్నారు.. మరి ఆ సినిమా విశేషాలు ఒకసారి చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2024, 01:09 PM IST
Music Shop Murthy: అజయ్ ఘోష్ తో చాందినీ చౌదరి.. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్

Ajay Ghosh and Chandini:
వైవిద్యమైన పాత్రలతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి సినిమాతో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈయన ఆ తరువాత కొన్ని కామెడీ పాత్రలు కూడా చేసి మరింత చేరువయ్యారు. మరోపక్క తన అందంతో పాటు అభినయంతో కూడా మనల్ని అలరించిన హీరోయిన్ చాందిని చౌదరి. కలర్ ఫోటో సినిమాలో తన నటనకు గాను ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అని తెలియడంతో ప్రేక్షకులు ఈ చిత్రంపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇప్పుడు ఆడియెన్స్‌‌ను బాగా మెప్పించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు కూడా భారీగా తెచ్చుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్ మూవీ తోనే మన ముందుకు రాబోతున్నారు అజయ్ ఘోష్. చాందినీ చౌదరి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలుగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే చిత్రం రాబోతోంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద.. హర్ష గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు ఈ సినిమా మేకర్స్. ఇందులో అజయ్ ఘోష్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ గమనిస్తుంటే అజయ్ ఘోష్ పాత్ర ఇందులో పూర్తి వినోదాత్మకంగా ఉండేలా అనిపిస్తోంది. కాగా ఈ పోస్టర్లో చాందిని చౌదరి పాత్రకు సంబంధించిన ఫోటో ని కూడా రిలీజ్ చేశారు. ఈ హీరోయిన్ ఈ పోస్టర్లో ఎంతో పద్ధతిగా.. చక్కగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ చూసిన దగ్గర నుంచి చాందినీ చౌదరి పాత్రకు, అజయ్ ఘోష్ కారెక్టర్‌కు ఉండే కనెక్షన్ ఏంటి? అసలు ఈ సినిమా పాయింట్ ఏంటి? వీరిద్దరి కథ ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకులలో ఏర్పడింది. అయితే ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాలి అంతే మాత్రం ఈ సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

ఈ చిత్రానికి పవన్ సంగీతాన్ని అందించగా శ్రీనివాస్ బెజుగమ్ కెమెరామెన్‌గా పని చేశారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్.. అలానే ఈ సినిమా విడుదల చేయండి మేకర్లు ప్రకటించనున్నారు.

Also read:  TS School Holiday: విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!

Also read: CGHS Scheme Benefits: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లభించే సీజీహెచ్ఎస్ ప్రయోజనాలు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News